News February 25, 2025

కామారెడ్డి: గురుకుల ప్రవేశ పరీక్షకు 97.34% హాజరు

image

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్షల నోడల్ అధికారి G.నాగేశ్వరరావు తెలిపారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 16 సెంటర్లు ఏర్పాటు చేయగా 97.34% శాతం హాజరు నమోదైందన్నారు. పరీక్షల్లో 7481 మంది విద్యార్థులకు గానూ 7282 మంది వచ్చారని పేర్కొన్నారు.

Similar News

News February 25, 2025

జోకర్‌గా జగన్.. జనసేన ఎమ్మెల్యే సెటైర్

image

AP: ప్రజా సమస్యల గురించి ఆలోచించకుండా జగన్ ఓ జోకర్‌గా మిగిలారని జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తోన్న ఆయన.. ప్రజా తీర్పును గౌరవించలేదని దుయ్యబట్టారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తోందని చెప్పారు.

News February 25, 2025

జపాన్ మీడియాతో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రం జపాన్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. మార్చి 28న ‘దేవర’ రిలీజ్ కానుండటంతో ప్రమోషన్ల కోసం ఎన్టీఆర్ మార్చి 22న జపాన్‌కు వెళ్లనున్నారు. ఈక్రమంలో అక్కడి మీడియాతో తారక్ వర్చువల్ ఇంటర్వ్యూలు ప్రారంభించినట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.

News February 25, 2025

అందుకే జగన్ అసెంబ్లీకి వెళ్లారు: పురందీశ్వరి

image

AP: ఆరు నెలలు అసెంబ్లీకి వెళ్లకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవుతుందని బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి అన్నారు. అందుకే నిన్న జగన్ సభకు వెళ్లి అటెండెన్స్ వేయించుకున్నారని విమర్శించారు. ప్రజలు తనకిచ్చిన బాధ్యతను జగన్ మరిచిపోవడం సరికాదని చురకలు అంటించారు. నిర్దిష్టమైన సంఖ్య ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందన్నారు. వైసీపీ పాలనలో గౌరవ సభను కౌరవ సభగా మార్చిందని దుయ్యబట్టారు.

error: Content is protected !!