News December 24, 2025

కామారెడ్డి: గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు

image

తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరి 22న నిర్వహించనున్నట్లు కామారెడ్డి జిల్లా సమన్వయ అధికారి శివరాం తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జనవరి 21లోపు విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశ పరీక్షలో మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తామన్నారు.

Similar News

News January 2, 2026

వికారాబాద్: ఈ ఫ్యామిలీ GREAT

image

‘కలసి ఉంటే కలదు సుఖం కమ్మని సంసారం’ అంటుంది VKBలోని బొంరాస్‌పేట మండలానికి చెందిన నీరటి నర్సమ్మ కుటుంబం. కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతున్న తరుణంలో నేటికీ మేము కలిసే ఉంటున్నామంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆమెకు మొత్తం నలుగురు కుమారులు, వారి భార్యలు, ఆరుగురు మనవళ్లు,11 మంది మనవరాళ్లు, ముని మనవడు, ముని మనువరాలు మొత్తం 27 మంది ఒకే దగ్గర ఉంటూ అన్ని కార్యక్రమాలను కలిసి నిర్వహించుకుంటున్నారు.

News January 2, 2026

వరంగల్ తూర్పులో పీక్స్‌కు చేరిన వైరం!

image

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గపోరు పీక్ స్థాయికి చేరింది. MLC, మాజీ MLCల వర్గాలు వీడిపోయాయి. గత రెండేళ్లలో వరంగల్ డివిజన్ పోలీసులు నమోదు చేసిన కేసులను తిరుగతోడుతున్నారు. కాంగ్రెస్‌కి చెందిన నాయకులపైనే బనాయించిన కేసులను మళ్లీ విచారణ చేయాలని, వాటిని నమోదు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ సీపీ సన్ ప్రీత్ సింగ్‌కు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య రాసిన లేఖ కలకలం రేపుతోంది.

News January 2, 2026

NLG: అభ్యర్థుల ఎంపికపై పార్టీల దృష్టి

image

రిజర్వేషన్లు-నామినేషన్లకు మధ్యలో సమయం ఉండే అవకాశం లేకపోవడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వార్డులవారీగా అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. రిజర్వేషన్ అనుకూలించినా లేకపోయినా ముందు జాగ్రత్తగా ప్రతీవార్డుకు కులాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు వార్డుల వారీగా ఆశావాహుల జాబితా రూపొందించే పనిలో పడ్డాయి