News October 25, 2025

కామారెడ్డి: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

ప్యాసింజర్ రైల్లో గుర్తు తెలియని మృతదేహం లభించినట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు. గుంటూరు నుంచి మెదక్ వెళ్తున్న ప్యాసింజర్ రైలులో సుమారు 45 సంవత్సరాలు గల వ్యక్తి మృతి చెంది ఉండగా పలువురు సమాచారం అందించినట్లు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. మృతుని వివరాలు తెలియవలసి ఉన్నాయని ఆయన చెప్పారు.

Similar News

News October 25, 2025

విరాట్ త్వరగా ఫామ్‌లోకి రావాలి: రవిశాస్త్రి

image

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వీలైనంత త్వరగా ఫామ్‌లోకి రావాలని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. ‘జట్టులో పోటీ తీవ్రంగా ఉంది. రోహిత్, కోహ్లీ, ఎవరైనా రిలాక్స్ అవడానికి లేదు. ఫుట్‌వర్క్ విషయంలో విరాట్ కాస్త ఇబ్బంది పడుతున్నాడు. వన్డే క్రికెట్‌లో అతని రికార్డు అమోఘం. రెండు వన్డేల్లోనూ పరుగులు చేయకపోవడం కోహ్లీని నిరాశకు గురిచేసి ఉండవచ్చు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

News October 25, 2025

కామారెడ్డి: కులం పేరుతో దాడి..13 మందికి జైలు శిక్ష

image

కులం పేరుతో దూషించి, దాడి చేసిన కేసులో 13 మంది నిందితులకు NZB కోర్టు శిక్ష విధించింది. సదాశివనగర్(M) అమర్లబండలో రాజేశ్వర్ తన ఇంట్లో భోజనం చేస్తుండగా రతన్ కుమార్‌తో పాటు మరో 12 మంది కులం పేరుతో దుషించి దాడి చేశారు. ఈ కేసును కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయగా కోర్టు A1 రతన్ కుమార్‌కు 3ఏళ్ల జైలు, రూ.7,200 జరిమానా మిగతా వారికి ఏడాది జైలు, రూ.4,200 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

News October 25, 2025

KMR: 49 దుకాణాలు.. 1,502 ఆశావహులు

image

వైన్స్ షాపు దరఖాస్తులకు సంబంధించి గడువు గురువారంతో ముగిసింది. కామారెడ్డి జిల్లాలో 49 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం 1,502 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు తెలిపారు.
కామారెడ్డి: 15 షాపులకు 467 దరఖాస్తులు
బాన్సువాడ: 9 షాపులకు 249 దరఖాస్తులు
బిచ్కుంద: 10 షాపులకు 233 దరఖాస్తులు
దోమకొండ: 8 షాపులకు 317 దరఖాస్తులు
ఎల్లారెడ్డి: 7 షాపులకు 236 దరఖాస్తులు వచ్చాయన్నారు.