News January 18, 2025
కామారెడ్డి: గెస్ట్ లెక్చరర్ పోస్టుల దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు, చరిత్ర సబ్జెక్టులను బోధించేందుకు గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ విజయ్ కుమార్ తెలిపారు. ఈనెల 18 నుంచి 20 వరకు కాలేజీలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈనెల 22న ఉదయం ఇంటర్వ్యూ ఉంటుందని స్పష్టం చేశారు.
Similar News
News September 15, 2025
HYD: రూ.1.09 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఈగల్ టీమ్

మత్తు పదార్థాలను తరలించే ముఠాలపై తెలంగాణ ఈగల్ టీమ్ ఉక్కుపాదం మోపింది. జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్థానిక పోలీసులతో కలిసి గతనెల 22 నుంచి ఈ నెల 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సంయుక్త ఆపరేషన్లు నిర్వహించింది. ఇందులో 12 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.1.09 కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
News September 15, 2025
రూ.5కే టిఫిన్.. ఈ నెలాఖరులోపు ప్రారంభం!

TG: హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఈ నెలాఖరు నుంచి రూ.5 కే టిఫిన్స్ అందించేందుకు GHMC సిద్ధమవుతోంది. పాత స్టాల్స్ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి ముందుగా 60 చోట్ల ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇడ్లీ, పొంగల్, పూరి, ఉప్మా వంటి అల్పాహారాలు అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. ఒక్కో బ్రేక్ ఫాస్ట్‌కు రూ.19 ఖర్చవుతుండగా రూ.14 జీహెచ్ఎంసీ భరించనుంది.
News September 15, 2025
జగిత్యాల: ‘ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలి’

ప్రజావాణి అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్, ఆర్ఓలతో కలిసి స్వీకరించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 31 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని తెలిపారు.