News October 7, 2025
కామారెడ్డి: గెస్ట్ లెక్చరర్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డిలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పీజీ సోషల్ వర్క్ విద్యార్థులకు బోధించడాని ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ విజయ్ కుమారు తెలిపారు. అభ్యర్థులు సోషల్ వర్క్ సబ్జెక్టులో 55% మార్కులతో పీజీ పాసై ఉండాలన్నారు. (ఎస్సీ/ఎస్టీలకు కనీసం 50 శాతం) పీహెచ్‌డీ/ నెట్/ సెట్/ బోధనానుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ నెల 8లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News October 7, 2025
మరోసారి టారిఫ్స్ బాంబు పేల్చిన ట్రంప్

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి టారిఫ్స్ బాంబు పేల్చారు. ఇతర దేశాల నుంచి USలోకి వచ్చే అన్ని మీడియం, హెవీ డ్యూటీ ట్రక్కులపై 25% టారిఫ్ విధించనున్నట్లు ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఇది ఈ ఏడాది నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి టారిఫ్‌ల మోత కొనసాగిస్తున్నారు. ఇప్పటికే భారత్ సహా పలు దేశాలపై అడిషనల్ టారిఫ్స్ విధించిన సంగతి తెలిసిందే.
News October 7, 2025
5-17 వయసు వారికి ఉచితం: ADB కలెక్టర్

17 ఏళ్ల లోపు పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్‌కు అక్టోబర్ 1 నుంచి ఎలాంటి రుసుము తీసుకోవడం లేదని
UIDAI తెలిపిందని కలెక్టర్ రాజర్షి షా వెల్లడించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని గమనించి ఆధార్‌లో మార్పులు చేర్పులు చేసుకోవాలని సూచించారు. 17 ఏళ్లు దాటినా వారందరికి రూ.125 వసూలు చేస్తారని తెలిపారు.
News October 7, 2025
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చిత్తశుద్ధితో ఉన్నాం: CM చంద్రబాబు

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ పటిష్టతకు, పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని CM చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఏడాది కాలంలో కేంద్ర సాయం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్లాంట్ ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి వచ్చింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ప్లాంట్‌ను నష్టాల నుంచి బయట పడేయడానికి, బలోపేతం చేయడానికి యాజమాన్యం, కార్మికులు, ఉద్యోగులు, ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి’ అని అధికారులతో సమీక్షలో వ్యాఖ్యానించారు.