News March 15, 2026

కామారెడ్డి: గ్యాస్ ‘నో స్టాక్’ బోర్డు

image

బిక్కనూరు మండల కేంద్రంలోని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న స్టాక్ పూర్తిగా కస్టమర్లకు పంపిణీ చేశామని, కొత్త నిల్వలు లేకపోవడంతో కార్యాలయం వద్ద ‘నో స్టాక్’ బోర్డు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు రమేష్ రెడ్డి తెలిపారు. గ్యాస్ సిలిండర్ల కోసం వచ్చే వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు. త్వరలోనే కొత్త స్టాక్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Similar News

News April 5, 2026

ఖానాపూర్: బీజేపీ ఛైర్‌ పర్సన్‌.. బీఆర్ఎస్ వైస్ ఛైర్మన్

image

ఖానాపూర్ మున్సిపల్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఛైర్మన్ పదవిని బీజేపీ దక్కించుకోగా, వైస్ ఛైర్మన్ పదవి బీఆర్ఎస్‌కు దక్కింది. ఛైర్మన్‌గా బీజేపీకి చెందిన అంకం మౌనిక, వైస్ ఛైర్మన్‌గా బీఆర్ఎస్ కౌన్సిలర్ మహమ్మద్ షోహెబ్ ఎన్నికయ్యారు. రాజకీయ సమీకరణాల మధ్య సాగిన ఈ ఎన్నిక ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. నూతన పాలకవర్గానికి పలువురు నేతలు అభినందనలు తెలిపారు.

News April 5, 2026

MIకి శుభవార్త.. కోలుకున్న హార్దిక్!

image

అనారోగ్యం కారణంగా DCతో మ్యాచ్‌కు దూరమైన MI కెప్టెన్ హార్దిక్ కోలుకున్నట్లు సమాచారం. ఎల్లుండి రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆయన ఆడనున్నట్లు తెలుస్తోంది. కాగా KKRపై గెలిచిన ముంబై నిన్న DC చేతిలో ఓడిన విషయం తెలిసిందే.

News April 5, 2026

పేదల న్యాయం కోసం జగ్జీవన్ రామ్ కృషి: ఎస్పీ స్నేహ మెహ్రా

image

బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పేర్కొన్నారు. ఆదివారం ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలో అందరికీ సమానత్వం, పేదల అభ్యున్నతే లక్ష్యంగా ఆయన పనిచేశారని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఎస్పీ తెలిపారు.