News March 26, 2024

కామారెడ్డి చరిత్రలో తొలిసారి ‘అవిశ్వాసం’

image

కామారెడ్డి మున్సిపాలిటీ చరిత్రలో తొలిసారి అవిశ్వాస తీర్మానానికి తెరలేచింది. ఈ నెల 30న తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఐదేళ్ల కింద BRS అధికారంలోకి రాగా ఛైర్‌పర్సన్ పదవిని అదే పార్టీకి చెందిన వ్యక్తికి కేటాయించారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సభ్యులు అవిశ్వాస ప్రక్రియకు సిద్ధమయ్యారు. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ నుంచి 27 మంది, BRS నుంచి 8 మంది సభ్యులు శిబిరానికి వెళ్లినట్లు సమాచారం.

Similar News

News September 29, 2024

NZB: చెత్తకాగితాలు పోగు చేసుకునే వ్యక్తి హత్య

image

నిజామాబాద్‌ నగరంలోని మూడో టౌన్ రైల్వే క్వార్టర్స్ ప్రాంతంలో హత్య జరిగింది. 3వ టౌన్ ఎస్సై మహేశ్ వివరాల ప్రకారం.. నవీపేట్‌కు చెందిన గణేశ్ (30) హత్యకు గురైనట్లు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు శనివారం రాత్రి ఘటనా స్థలానికి వెళ్లగా చెత్త సేకరించుకొని బ్రతికే వ్యక్తిగా గుర్తించారు. గుర్తుతెలియని వారు మెడకి తాడు బిగించి హత్య చేసినట్లు గుర్తించమన్నారు. కేసు నమోదైంది.

News September 29, 2024

శ్రీ నరేంద్రాచార్య మహరాజ్‌ను దర్శించుకున్న ప్రముఖులు

image

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని దోస్త్ పల్లి, బంగారపల్లి శివారులో గల తెలంగాణ ఉపపీఠంలో జగద్గురు శ్రీ స్వామి నరేంద్రాచార్య మహరాజ్‌ను శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వ్యక్తిగత కార్యదర్శి శ్రీ బాలాజీ పాటిల్ ఖత్ గావ్ కర్ దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన వెంట నాందేడ్ జిల్లా బీజేపీ నాయకులు వెంకట్రావు, పాటిల్ గోజేగావ్కర్, శివరాజ్ పాటిల్ హోటల్కర్, మాధవ్ రావు ఉన్నారు.

News September 29, 2024

ఏపీలోని మైదుకూరులో రోడ్డు ప్రమాదం.. బాన్సువాడ వాసి మృతి

image

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన సయ్యద్ అహమదుల్లా శనివారం ఏపీలోని మైదుకూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మైదుకూరు పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని వీక్లీ మార్కెట్లో నివాసం ఉంటున్న సయ్యద్ అహ్మదుల్లా(39) బైకుపై వెళ్తున్న క్రమంలో టిప్పర్ ఢీకొట్టడంతో మృతి చెందినట్లు తెలిపారు. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.