News January 10, 2026

కామారెడ్డి: చలి వణికిస్తోంది..అత్యల్ప ఉష్ణోగ్రతలు

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. జుక్కల్ 9.4°C, మేనూరు 9.5, డోంగ్లి 10.1, గాంధారి 10.3, మాక్దూంపూర్ 10.4, పెద్ద కొడప్గల్, లచ్చపేట 10.5, పుల్కల్, సర్వాపూర్, పిట్లం, దోమకొండ 10.7, బిచ్కుంద 10.8, ఇసాయిపేట, కొల్లూరు 10.9, ఎల్పుగొండ 11, మచాపూర్, నస్రుల్లాబాద్, బొమ్మన్ దేవిపల్లి, నాగిరెడ్డిపేట 11.1° C ల ఉష్ణోగ్రతలు నమోదై చలి వణికిస్తోంది.

Similar News

News February 21, 2026

BREAKING: పాలమూరు: విషాదం.. యువకుడు సూసైడ్

image

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మార్చాలకు చెందిన సాయిప్రసాద్ (23) కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటూ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల అతడు స్వగ్రామానికి వచ్చాడు. ఈరోజు గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News February 21, 2026

ధర్మపురి: ‘బ్రహ్మోత్సవాలు జిల్లాకు ప్రతిష్ఠాత్మకం’

image

ధర్మపురిలో జరగనున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జిల్లాకు ప్రతిష్ఠాత్మకమని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఈసారి భక్తుల రద్దీ గతేడాదితో పోలిస్తే ఎక్కువగా ఉండే అవకాశముందని అంచనా వేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, క్యూలైన్ల నిర్వహణ పక్కాగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్నదాన కేంద్రాలు, సూచిక బోర్డులు, చలువ పందిర్లు ఏర్పాటు చేయాలన్నారు.

News February 21, 2026

పనికిరాని వస్తువులకు నిత్యావసరాలు.. సీఎం ప్రకటన

image

AP: ప్రతి మండలానికి ఒక స్వచ్ఛ రథం ఏర్పాటు చేస్తున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. ‘‘ఇవి వారానికోసారి గ్రామానికి వస్తాయి. ఇళ్లలో పనికిరాని వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసర వస్తువులు ఇస్తారు. వచ్చేనెల కల్లా అన్ని పంచాయతీల్లో 100% ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తాం. రాజమండ్రి, KNL, KDP, నెల్లూరులో రూ.1,254CRతో PPP విధానంలో ‘వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల’ను మార్చి 15కల్లా వినియోగంలోకి తెస్తాం’’ అని తెలిపారు.