News January 18, 2026
కామారెడ్డి: చికెన్@310

కామారెడ్డి జిల్లాలో చికెన్ ధరలు గత పది రోజులుగా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆదివారం జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో కిలో చికెన్ రూ. 300 నుంచి రూ. 310 వరకు విక్రయించారు. మటన్ ధర కిలో రూ. 800 వద్ద స్థిరంగా ఉంది. కోళ్ల దాణా ధరలు భారీగా పెరగడం వల్లే చికెన్ ధరలు తగ్గడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. ధరల పెరుగుదలపై మాంసం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 26, 2026
మెదక్: ఆధార్ కోసం క్యూ కట్టిన కోతి..!

ఆధార్ కార్డు కేవలం మనుషులకేనా.. మాకూ కావాలి అన్నట్టుగా వ్యవహరించింది ఆ కోతి. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కార్యాలయం వద్ద ఆధార్ కేంద్రం బోర్డును ఓ కోతి ఆక్రమించింది. నిత్యం ప్రజలను భయపెట్టే ఈ వానర సైన్యం, ఒక్కసారిగా ఆధార్ బోర్డుపై ఎక్కి అటు ఇటు ఊగుతూ హల్‌చల్ చేసింది. ఈ వింత దృశ్యాన్ని చూసిన స్థానికులు, “కోతి కూడా ఆధార్ కోసం క్యూ కట్టినట్లుంది” అని సరదాగా అన్నారు.
News March 26, 2026
మహాభారతంలో భాగమే భగవద్గీత

వ్యాసుడు రచించిన మహాభారతంలో ఓ భాగమే భగవద్గీత అనే విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. భారత ఇతిహాసంలో భీష్మ పర్వం 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు మొత్తం 18 అధ్యాయాలను భగవద్గీతగా చెబుతారు. ఇందులో మొత్తం 700 శ్లోకాలు ఉంటాయి. ఇవి మనం ధర్మబద్ధంగా ఎలా జీవించాలో నేర్పుతాయి. బంధువులను చంపడానికి విముఖత చూపిన అర్జునుడిని ధర్మ మార్గాన్ని చూపడానికి, ధర్మాన్ని గెలిపించడానికి కృష్ణుడు గీతబోధ చేశాడు.
News March 26, 2026
పల్నాడుకు ప్రాతినిధ్యం వహించిన మహిళా మణులు వీరే..!

పల్నాడు ప్రాంత ప్రజలు 1967లోనే మహిళలకు పట్టం కట్టారు. 1967,1972లలో వినుకొండ నియోజకవర్గం నుంచి తొలి మహిళా MLAగా భవనం జయప్రద ఎన్నికవటంతో పాటు మంత్రిగా విధులు నిర్వర్తించారు. 1983 సత్తెనపల్లి,1989లో వినుకొండ నుంచి నన్నపనేని రాజకుమారి MLAగా ఎన్నికయ్యారు.1994లో సత్తెనపల్లి నుంచి పుతంబాక భారతి, 1999లో మాచర్ల నుంచి జూలకంటి దుర్గమ్మ, 2019లో చిలకలూరిపేట నుంచి విడుదల రజిని MLAగా, మంత్రిగా పనిచేశారు.


