News January 19, 2026

కామారెడ్డి: జాతీయ స్థాయి శిక్షణ పూర్తి చేసుకున్న జిల్లా ఉపాధ్యాయుడు

image

ఎన్సీఈఆర్టీ విద్యాపరమైన అంశాల్లో జాతీయస్థాయిలో 21 రోజుల శిక్షణను బాన్సువాడ మండలం నాగారం ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎం. ప్రసూన్ కుమార్ పూర్తి చేసుకున్నారు. జాతీయ స్థాయిలో 30 మంది ఎంపిక కాగా తెలంగాణ నుంచి ఎంపిక ముగ్గురిలో అతను ఒకరు. పాఠ్యపుస్తకాల రూపకల్పన, జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా పాఠ్య సామగ్రి తయారు చేయడం వంటి అంశాలపై ఆయన శిక్షణ పొందారు.

Similar News

News February 22, 2026

తగ్గనున్న వంటనూనె ధరలు?

image

వంటనూనెల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. క్రూడ్ పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకాన్ని కేంద్రం 10% తగ్గించింది. ఈ నిర్ణయం మే 31 నుంచి అమల్లోకి రానుంది. దీనివల్ల మొత్తం సుంకం 27.5% నుంచి 16.5% పడిపోతుంది. భారత్ తన వంటనూనెల అవసరాల కోసం 70% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో లీటర్ నూనెపై ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

News February 22, 2026

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్: SP

image

తూ.గో జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షల కోసం అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని SP నరసింహ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి చేరుకోవాలని, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు.

News February 22, 2026

కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో లాభాలు

image

కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు బీపీ, కొలెస్ట్రాల్‌‌ను అదుపులో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే క్రోసెటిన్, క్రోసిన్ కుంకుమపువ్వులో ఉంటాయంటున్నారు. రోగనిరోధకశక్తిని పెంచడంలో కూడా ఇది తోడ్పడుతుంది. పాలలో కలుపుకొని తాగటం లేదా కుంకుమ పువ్వు టీ చేసుకొని తాగడం మంచిదని సూచిస్తున్నారు.