News January 27, 2025

కామారెడ్డి: జిజిహెచ్ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు

image

76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి లోని పలు ఉద్యోగులకు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫరీదా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆస్పత్రిలోని పలు విభాగాల్లో వైద్య సేవలు నిర్వహిస్తున్న సిబ్బంది ఆదివారం ప్రశంసా పత్రాలు అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, పలు విభాగాల వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 19, 2025

ఆసీస్ భారీ ఆధిక్యం.. ఇంగ్లండ్‌కు మరో ఓటమి తప్పదా?

image

యాషెస్ సిరీస్ మూడో టెస్టులో భారీ ఆధిక్యం దిశగా ఆస్ట్రేలియా దూసుకుపోతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 271-4 పరుగులు చేసింది. ప్రస్తుతం 356 పరుగుల లీడ్‌‌లో ఉంది. ట్రావిస్ హెడ్ (142), అలెక్స్ కేరీ(52) క్రీజులో ఉన్నారు. జోష్ టంగ్ 2, విల్ జాక్స్, కార్స్ తలో వికెట్ తీశారు. ఇంకా రెండు రోజుల ఆట ఉండటంతో ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం నిర్దేశించే అవకాశం ఉంది. ఇంగ్లండ్ ఇప్పటికే వరుసగా 2 టెస్టులు ఓడింది.

News December 19, 2025

ఈ ఏడాది ఇండియాలో ఎంతమంది పుట్టారంటే?

image

ఈ ఏడాది కూడా ఇండియాలో ఎక్కువ జననాలు నమోదైనట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. DEC 2వ వారానికి ప్రపంచవ్యాప్తంగా నమోదైన జననాల్లో సుమారు 2.3 కోట్ల (23.1 మిలియన్)తో మనం టాప్ ప్లేస్‌లో ఉన్నాం. తర్వాతి స్థానాల్లో చైనా (87 లక్షలు), నైజీరియా (76 లక్షలు), పాకిస్థాన్ (69 లక్షలు) ఉన్నాయి. కాగా 2025లో సంతానోత్పత్తి రేటు (1.9) స్వల్పంగా తగ్గినట్లు సమాచారం. ప్రపంచ జనాభాలో భారత్ అగ్రస్థానంలో ఉండటం గమనార్హం.

News December 19, 2025

కాలీఫ్లవర్‌లో ‘రైసీనెస్’ రావడానికి కారణమేంటి?

image

ఉష్ణోగ్రతలు పెరిగిన సందర్భంలో కాలీఫ్లవర్‌లో పువ్వు వదులుగా విచ్చుకున్నట్లుగా అయ్యి పువ్వు గడ్డపై నూగు వస్తుంది. దీని వల్ల పంట నాణ్యత తగ్గి, మార్కెట్ విలువ ఆశించిన మేర అందక రైతులు నష్టపోతారు. రైసీనెస్ సమస్య నివారణకు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే కాలీఫ్లవర్ రకాలను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కాలీఫ్లవర్ పువ్వులను కూడా సరైన సమయంలో ఆలస్యం చేయకుండా పంట నుంచి సేకరించాలి.