News March 20, 2025
కామారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్

రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం అయినప్పటికీ.. పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News March 21, 2025
గంగానమ్మ స్థలాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి

నూజివీడులోని కృష్ణ బడ్డీ కొట్టు సెంటర్లో గంగానమ్మ రావిచెట్టు వద్ద ఓ వ్యక్తి విధ్వంసం సృష్టిస్తున్నాడని సమాచారం రావడంతో పట్టణ పోలీసులు శుక్రవారం ఆ వ్యక్తిని పోలీసు స్టేషన్కు తరలించారు. అమెరికాలో MS చదివిన ఎడవల్లి రవిచంద్ర (30) అనే యువకుడికి మతిస్థిమితం లేదని స్థానికుల అంటున్నారు. శుక్రవారం గంగానమ్మను పెట్టి పూజిస్తున్న స్థలాన్ని గడ్డ పలుగుతో పగలగొడుతుండగా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు.
News March 21, 2025
శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 58,872 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా..23,523 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు.
News March 21, 2025
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 37.9°C నమోదు కాగా, శంకరపట్నం 37.8, కరీంనగర్ రూరల్ 37.6, జమ్మికుంట 37.5, గన్నేరువరం 36.8, చొప్పదండి, మానకొండూర్ 36.6, రామడుగు 36.5, చిగురుమామిడి 36.4, వీణవంక 36.3, తిమ్మాపూర్ 36.1, కరీంనగర్ 36.0, కొత్తపల్లి 35.2, ఇల్లందకుంట 35.0, హుజూరాబాద్ 34.9, సైదాపూర్ 34.0°C గా నమోదైంది.