News January 22, 2025

కామారెడ్డి జిల్లాకు పామాయిల్ తయారీ యూనిట్

image

కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం యూనిలివర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. CM రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల బృందంతో యూనిలివర్ కంపెనీ ప్రతినిధులు జరిపిన చర్చల అనంతరం అంగీకరించారు. పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Similar News

News October 28, 2025

HYD: స్కిల్ ఉంటేనే ఉద్యోగం!

image

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి డిగ్రీ, పీజీ పట్టాలు చేత పట్టుకుని HYD వస్తున్న వారికి కార్పొరేట్ కంపెనీలు నిరాశ మిగులుస్తున్నాయి. యంగ్ యూత్ ఎంప్లాయబిలిటీ సర్వే ప్రకారం.. పట్టాలు ఉన్న ప్రయోజనం ఉండటం లేదని, ఉద్యోగం దొరకటం లేదని పేర్కొంది. పట్టాతో పాటు స్కిల్ ఉండి, అనుభవం కలిగిన వారికి రూ.40 వేల పైగా శాలరీతో ఉద్యోగాలు వస్తున్నాయని, లేదంటే రూ.15 వేలు రావటం కష్టంగా ఉందని పేర్కొంది.

News October 28, 2025

తిరుమలలో ఈనెల 30న పుష్పయాగం

image

తిరుమల శ్రీవారి ఆలయంలో 30న గురువారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. 29న బుధవారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణను వసంత మండపంలో నిర్వహించనున్నారు. అంతకు మునుపు మృత్సం గ్రహణం, ఇతర పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం, సాయంత్రం ఆలయ నాలుగు మాడ వీధుల్లో మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తారు.

News October 28, 2025

కళాశాలల అభివృద్ధి పురోగతిపై కలెక్టర్ సమీక్ష

image

భద్రాద్రి జిల్లాలో జూనియర్ కళాశాలల అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై, కళాశాలల్లో చేరికలు, ఉత్తీర్ణత శాతం, అవసరమైన మౌలిక సదుపాయాలపై కలెక్టర్ జితేష్ వి పాటిల్.. ప్రిన్సిపల్‌, ఇంజనీరింగ్ అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో సమీక్ష జరిపారు. తరగతి గదులు, లీకేజీ నివారణ, విద్యుతీకరణ, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు.