News November 19, 2025

కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. బీబీపేట 9.3°C, లచ్చపేట 9.5, గాంధారి 9.6, డోంగ్లి, నస్రుల్లాబాద్ 9.7, బొమ్మన్ దేవిపల్లి, మేనూర్‌లలో 9.8, రామలక్ష్మణపల్లి 9.9, సర్వాపూర్ 10, బీర్కూర్ 10.2, జుక్కల్ 10.5, ఇసాయిపేట,రామారెడ్డి, ఎల్పుగొండ 10.6, పుల్కల్ 11, దోమకొండ 11.1, బిక్కనూర్ 11.3°C నమోదయ్యాయి.

Similar News

News April 14, 2026

ఏలూరు: కలెక్టరేట్‌లో అంబేడ్కర్ జయంతి

image

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన దార్శనికుడు అంబేడ్కర్ అని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ కొనియాడారు. ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో మంగళవారం అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, జేసీలు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

News April 14, 2026

మునగాకుతో ఎన్నో లాభాలు

image

ఆయుర్వేదంలో మునగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. NCBI నివేదిక ప్రకారం.. మునగ ఆకుల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్, బీటా-కెరోటిన్, అమైనో యాసిడ్స్‌, ఫినోలిక్‌లతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇందులో ఉండే పీచు, జీర్ణవ్యవస్థతో పాటు పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.

News April 14, 2026

VJA: అంబేద్కర్ స్మృతి వనంలో ఓపెన్ థియేటర్ మూత!

image

విజయవాడలోని అంబేడ్కర్ స్మృతి వనంలో ఓపెన్ థియేటర్ నిర్వహణ అటకెక్కింది. 90 మంది సామర్థ్యంతో నిర్మించిన ఈ థియేటర్ మరమ్మతుల సాకుతో మూతపడింది. మరోవైపు రూ.404 కోట్ల ప్రాజెక్టులో ఇప్పటివరకు రూ.320 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. రూ.90 కోట్లతో కళామందిరం సిద్ధమైనా, ఫుడ్ కోర్టు, చిల్డ్రన్ పార్క్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఈ ఓపెన్ థియేటర్ గురించి ప్రచారం చేయకపోవడంపై విమర్శలు వినిసిస్తున్నాయి.