News December 22, 2025
కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు ఇలా

కామారెడ్డి జిల్లాలో చలి తీవ్రత ఇలా ఉన్నాయు. అత్యధికంగా గాంధారి మండలంలో 9.7, రామ్ లక్ష్మణ్‌పల్లిలో 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, దోమకొండ, మాచారెడ్డి మండలాలలో 10.4, జుక్కల్, డోంగ్లి మండలాలలో 10.5, మహమ్మద్ నగర్ మండలంలో 10.6, పెద్దకొడుపగల్, పాల్వంచ మండలాలలో 10.7 ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మిగతా మండలాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News December 23, 2025
సివిల్ రైట్స్ డేకి డీవీఎంసీ సభ్యులందరినీ ఆహ్వానించాలి: VZM కలెక్టర్

ప్రతి నెల 30వ తేదీన నిర్వహించే పౌర హక్కుల దినం (సివిల్ రైట్స్ డే)కు డీవీఎంసీ సభ్యులందరినీ ఆహ్వానించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ప్రతి మండలంలో ఎస్‌హెచ్‌వో, తహశీల్దార్ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే నిర్వహించాలన్నారు.
News December 23, 2025
జూన్ నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి: పార్థసారథి

AP: 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి చెప్పారు. నిర్మాణంలో ఉన్న 5.5L ఇళ్లను వచ్చే జూన్-జులై నాటికి పూర్తి చేయాలని CM ఆదేశించారన్నారు. టిడ్కో గృహాలకుగాను కేంద్రంతో కలిసి SC, BC, మైనార్టీలకు ₹50K, STలకు ₹75K, పీజీటీడీఎస్ వర్గాలకు ₹లక్ష వరకు అదనపు సాయం అందిస్తున్నాం. అన్ని సమస్యలను పరిష్కరించి వచ్చే జూన్‌కు గృహాలను అందిస్తాం’ అని తెలిపారు.
News December 23, 2025
టెన్షన్ వద్దు.. ప్రతి గంటకు పరీక్షలు చేస్తాం: HMWSSB

ఇటీవల గండిపేట చెరువులో సెప్టిక్ ట్యాంక్‌తో వ్యర్థాలను వదులుతుండటంతో నగరం ఉలిక్కిపడింది. కాగా జలాశయం నుంచి నీటిని ఆసిఫ్‌నగర్, మీర్‌ఆలం వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు తరలించి శుద్ధి చేసిన అనంతరం HYDకు సరఫరా చేస్తామని HMWSSB తెలిపింది. నీటి నాణ్యతపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ప్రతి గంటకు నీటి ప్రమాణాలను పరీక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు. శుద్ధి ప్రక్రియలో అన్ని భద్రతా చర్యలు పాటిస్తున్నామన్నారు.


