News January 1, 2026

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయంటే!

image

కామారెడ్డి జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. మేనూర్, రామలక్ష్మణపల్లి 12.1°C, గాంధారి 12.4, జుక్కల్ 13.1, డోంగ్లి 13.2, దోమకొండ 13.6, మాచాపూర్, పెద్దకొడప్గల్, నాగిరెడ్డిపేట్ 13.8, ఎల్పుగొండ 13.9, లచ్చపేట 14, బిచ్కుంద 14.1, రామారెడ్డి 14.3, పుల్కల్ 14.7, మాక్దూంపూర్ 14.8, పిట్లం, బీర్కూర్ 14.9°Cల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News January 2, 2026

కృష్ణా జలాలపై ఎవరి దారి వారిదే

image

TG: కృష్ణా జలాలపై ప్రభుత్వం, BRS ఎవరి దారి వారిదే అన్నట్లు మారింది. దీనిపై అసెంబ్లీలో చర్చకు INC సిద్ధమవగా సభను బహిష్కరిస్తున్నట్లు విపక్షం ప్రకటించింది. కాగా రేపు TG భవన్లో ఈ అంశంపై MLAలతో సమావేశమై PPT ప్రజెంటేషన్ ఇవ్వాలని BRS నిర్ణయించింది. GOVT మాత్రం సభలో దీనిపై చర్చ గురించి ఇంకా తేల్చలేదు. చర్చించినా CPI, MIM సానుకూలమే. కేంద్రంలో అధికార పార్టీగా ఉన్న BJP తటస్థంగా ఉండొచ్చని భావిస్తున్నారు.

News January 2, 2026

ఖమ్మం: ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా

image

వేంసూరు మండలంలోని వివేకానంద ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు కాలువలో బోల్తా పడింది. బస్సు బీరపల్లి నుంచి సుబ్బాయిగూడెం వెళ్తుండగా పెనుబల్లి మండలం గణేశునిపాడు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 100 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 2, 2026

పార్క్‌‌లలో సీజనల్ ఫ్లవర్ ప్లాంట్‌లను నాటండి: బల్దియా కమిషనర్

image

పార్క్ లలో సీజనల్ ఫ్లవర్ ప్లాంట్లను నాటాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఉద్యాన అధికారులను ఆదేశించారు. శుక్రవారం HNK పబ్లిక్ గార్డెన్, బాలసముద్రంలోని చిల్డ్రన్స్ పార్క్, జయశంకర్ ఏకశిలా పార్క్‌లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. శీతాకాల సీజన్‌లో పుష్పించే పూల మొక్కలను నాటడం వల్ల పార్క్‌ల ఆవరణలు ఆహ్లాదకరంగా ఉంటాయన్నారు. సీహెచ్‌ఓ రమేష్, హార్టికల్చర్ అసిస్టెంట్ ప్రవళిక ఉన్నారు.