News December 16, 2025

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయంటే!

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24గంటల్లో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. డోంగ్లి, నస్రుల్లాబాద్ 10.2°C, లచ్చపేట దోమకొండ 10.4, మేనూర్ పెద్దకొడప్గల్, బొమ్మన్ దేవిపల్లి 10.5, జుక్కల్ 10.6, ఎల్పుగొండ 10.7, రామలక్ష్మణపల్లి, బిచ్కుంద 10.8, నాగిరెడ్డిపేట 10.9, సర్వాపూర్, మగ్దుంపూర్, పిట్లం 11, గాంధారి, పుల్కల్ 11.1, ఇసాయిపేట 11.2°C గా నమోదయ్యాయి.

Similar News

News December 17, 2025

భారత ఉపరాష్ట్రపతిని కలిసిన MP వేమిరెడ్డి

image

నెల్లూరు MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం ఢిల్లీలో భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి కార్యాలయానికి బుధవారం MP వెళ్లారు. ఇందులో భాగంగా వేమిరెడ్డి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం వారు అంశాలపై చర్చించారు.

News December 17, 2025

పెద్దపల్లి: పి.సి.పి.యన్.డి.టి. అడ్వైజరీ కమిటీ సమావేశం

image

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. వి.వాణిశ్రీ అధ్యక్షతన పి.సి.పి.యన్.డి.టి. అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. 33 స్కానింగ్ కేంద్రాలు రిజిస్టర్ అయినట్లు తెలిపారు. ప్రతి నెలలో 8-10 కేంద్రాలను తనిఖీ చేస్తున్నామని, ఈ నెలలో కూడా తనిఖీలు పూర్తయ్యాయని చెప్పారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చట్టం ప్రకారం, లింగ నిర్ధారణ నేరం, 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10,000/- జరిమానా విధించబడుతుందని తెలిపారు.

News December 17, 2025

SRD: సర్పంచ్‌గా 4 ఓట్లతో విజయం

image

కంగ్టీ మండలం‌ దామరగిద్ద(పంచ మహల్) గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి హన్మంత్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్ధి అభ్యర్థి మీద 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఫలితాలు వెలువడగానే కాంగ్రెస్ పార్టీ అనుచరులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.