News December 25, 2025

కామారెడ్డి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు

image

కామారెడ్డి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. గడిచిన 24 గంటల్లో గాంధారి మండలంలో అత్యల్పంగా 9.4 డిగ్రీలు నమోదు కాగా, జుక్కల్‌లో 9.6, మద్నూర్‌లో 9.7, డోంగ్లి, మాచారెడ్డిల్లో 9.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల్లో 10 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. పెరుగుతున్న చలి దృష్ట్యా వృద్ధులు, చిన్నారుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News December 25, 2025

వరంగల్: అటకెక్కిన నియో మెట్రో రైలు ప్రాజెక్టు!

image

వరంగల్‌లో నియో మెట్రో రైలు ప్రాజెక్టు అటకెక్కినట్లు కనిపిస్తోంది. KZPT రైల్వే స్టేషన్ నుంచి WGL బస్టాండ్ వరకు 15.5 కి.మీ పొడవున నిర్మించాలని ప్రతిపాదించగా, మహా మెట్రో సంస్థ డీపీఆర్‌ను తయారు చేసింది. రూ.1100 కోట్ల నుంచి రూ.1340 కోట్లతో 21స్టేషన్లు, 12స్టేషన్లు ఎలివేటెడ్, 9 స్టేషన్లు భూమిపైన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 25ఎకరాల్లో మెయింటెన్స్ డిపోను NSPTవైపు నిర్మించాలని ప్రతిపాదించారు. మీ కామెంట్.

News December 25, 2025

సోషల్‌ మీడియా వాడేందుకు సైనికులకు అనుమతి?

image

భారత సైన్యం సోషల్ మీడియా నిబంధనలను సడలించినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, X వంటి యాప్‌లను వాడేందుకు సైనికులు, అధికారులకు అనుమతి ఇచ్చినట్లు డిఫెన్స్ వర్గాలు తెలిపాయి. అయితే సమాచారం తెలుసుకోవడం, కంటెంట్ చూడటానికి మాత్రమే అనుమతి ఉంటుంది. పోస్ట్, లైక్, కామెంట్ చేయడానికి పర్మిషన్ లేదని సమాచారం. హనీ ట్రాప్స్ వంటి ముప్పు నేపథ్యంలో భద్రతా నియమాలు పాటిస్తూనే ఈ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలుస్తోంది.

News December 25, 2025

ప్రకాశం జిల్లా మెప్మా పీడీపై చర్యలు

image

ప్రకాశం మెప్మా పీడీ శ్రీహరిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో బాపట్ల పీడీని నియమించారు. దాదాపు రూ.10 కోట్లు బోగస్ సంఘాలకు రుణాలుగా ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. మెప్మాలో అవినీతి జరిగిందంటూ గతంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సైతం ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు విచారణ సైతం సాగుతోంది. విచారణ పర్వంలోనే పీడీని సరెండర్ చేయడం విశేషం.