News January 11, 2026

కామారెడ్డి జిల్లాలో కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో ఆదివారం మాంసం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి సీజన్ కావడంతో డిమాండ్ ఉన్నప్పటికీ, గత వారం ధరలనే వ్యాపారులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో మటన్ రూ. 800, చికెన్ రూ. 300 విక్రయిస్తుండగా.. లైవ్ కోడి ధర రూ. 200గా ఉంది. పండుగ సమీపిస్తుండటంతో చికెన్ సెంటర్ల వద్ద మాంసం ప్రియుల సందడి పెరిగింది.

Similar News

News February 15, 2026

కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)- బెంగుళూరు(SMVB) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.08581 VSKP- SMVB రైలు మార్చి 1 నుంచి 29 వరకు ప్రతి ఆదివారం, నం.08582 SMVB- VSKP మధ్య నడిచే రైలు మార్చి 2 నుంచి 30 వరకు ప్రతి సోమవారం ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని ఆదివారం ప్రకటించారు.

News February 15, 2026

నెల్లూరు: శివరాత్రి జాగరణ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

image

మహా శివరాత్రి సందర్భంగా భక్తులు రాత్రంతా జాగరణ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, వృద్ధులు, షుగర్ వ్యాధిగ్రస్థులు ఉపవాసం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నీరు, పండ్ల రసాలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. రాత్రి వేళ డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్రమత్తులో ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

News February 15, 2026

జగిత్యాల ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్‌!

image

TG: జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై ఉత్కంఠ వీడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ జెండా మోసిన వారికే ఛైర్మన్ పదవి ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించింది. MLA సంజయ్‌, జీవన్‌రెడ్డితో మంత్రి అడ్లూరి, AICC సెక్రటరీ సవాంగ్‌ మాట్లాడారు. ఇరువర్గాలకు నచ్చజెప్పి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. 23 మంది అభ్యర్థులతో MLA సంజయ్ క్యాంప్ ఏర్పాటు చేయగా, 14 మందితో జీవన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే.