News November 15, 2025

కామారెడ్డి జిల్లాలో చలి పంజా

image

కామారెడ్డి జిల్లాలో ప్రజలు చలితో బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో గడిచిన 24గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. అత్యల్పంగా బీబీపేటలో 8.6°C నమోదు అయ్యింది. బొమ్మన్ దేవిపల్లి 8.9, నస్రుల్లాబాద్, గాంధారిలో 9, లచ్చపేట 9.5, ఎల్పుగొండ, డోంగ్లిలలో 9.6, బీర్కూర్, రామలక్ష్మణపల్లిలో 9.7, సర్వాపూర్ 10, మేనూరు 10.1, రామారెడ్డి 10.3గా నమోదయ్యాయి.

Similar News

News November 15, 2025

రాష్ట్ర వ్యాప్తంగా 88 వేల కోట్ల చేప పిల్లల పంపిణీ: వాకిటి

image

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల చెరువుల్లో 88 వేల కోట్ల చేప పిల్లలు, 300 చెరువుల్లో 28 కోట్ల రొయ్యలు పంపిణీ చేయనున్నట్లు మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్‌లో మాట్లాడుతూ.. చేపల పంపిణీ పారదర్శకంగా ఉండేలా చెరువుల వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని, చేపల మార్కెట్, స్టోరేజ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మత్స్య సంపదతో ఆర్థిక అభివృద్ధి సాధించేలా చర్యలు చేపడతామన్నారు.

News November 15, 2025

CSK కెప్టెన్‌గా సంజూ శాంసన్?

image

చెన్నై సూపర్ కింగ్స్‌లోకి సంజూ శాంసన్ రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ధోనీ తర్వాత జట్టు పగ్గాలు ఎవరికన్న ప్రశ్నకు సమాధానంగానే సంజూను జట్టులోకి తీసుకున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ధోనీ నుంచి రుతురాజ్‌కు ఆ బాధ్యతలిచ్చారు. మళ్లీ MSDనే కెప్టెన్ చేశారు. అయితే ఈ సమస్యకు సంజూనే శాశ్వత పరిష్కారమని విశ్లేషకులూ భావిస్తున్నారు. అటు జట్టు భవిష్యత్తు కోసం జడేజానూ CSK త్యాగం చేసిందంటున్నారు.

News November 15, 2025

అయ్యప్ప స్వాములకు తప్పక తెలియాల్సిన ప్రాంతం

image

అయ్యప్ప స్వామితో యుద్ధంలో మహిషి అనే రాక్షసి మొండెం పడిన ప్రదేశాన్ని ‘ఎరుమేలి’ అని అంటారు. దీన్నే ‘కొట్టబడి’ అని పిలుస్తారు. శబరిమల యాత్రలో ఎరుమేలికి చేరుకున్న భక్తులు ‘స్వామి దింతకతోమ్… అయ్యప్ప దింతకతోమ్’ అని ‘పేటత్తుళ్లి’ అనే సాంప్రదాయ నృత్యం చేస్తారు. ఇది మహిషిపై సాధించిన విజయాన్ని గుర్తుచేస్తుంది. ఎరుమేలి అయ్యప్ప భక్తులకు ఓ ముఖ్యమైన ఆరంభ స్థానంగా, పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. <<-se>>#AyyappaMala<<>>