News December 15, 2025

కామారెడ్డి జిల్లాలో చలి తీవ్రత

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. రామలక్ష్మణపల్లి 9.6°C, గాంధారి 9.9, మేనూర్ 10.1, పెద్ద కొడప్గల్ 10.2, డోంగ్లి, లచ్చపేట, దోమకొండ 10.4, బిచ్కుంద, జుక్కల్ 10.5, తాడ్వాయి 10.6, నస్రుల్లాబాద్, బొమ్మన్ దేవిపల్లి, నాగిరెడ్డిపేట, ఎల్పుగొండ 10.7, మాచాపూర్, సర్వాపూర్ 10.8°Cలుగా నమోదయ్యాయి.

Similar News

News April 5, 2026

తూ.గో: వేలాదిగా వస్తున్న భక్తులు.. పొంచి ఉన్న పులి

image

దేవీపట్నం మండలంలో పులి సంచరిస్తుండటంతో గొందూరు పోశమ్మ గండి భక్తులు జాగ్రత్తగా ఉండాలని ధర్మకర్తమండలి సూచించింది. ఆదివారం వేలాది మంది భక్తులు వస్తుండటంతో కొండప్రాంతాలకు వెళ్లవద్దని కోరింది. గండి నుంచి పూడిపల్లి వైపు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పాపికొండల పర్యాటకులు సాయంత్రం లోపే తిరిగి రావాలని ఆదేశించారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని భక్తులు, స్థానికులకు విజ్ఞప్తి చేశారు.

News April 5, 2026

ఆ ఏనుగు ఫిబ్రవరిలోనే చనిపోయింది!

image

జైపూర్‌లో ఓ ఏనుగుకు ఒళ్లంతా పింక్ కలర్ వేసి ఫొటోషూట్ చేయడం ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే, ఆ ఘటన ఏడాది క్రితం జరిగినట్లు తాజాగా తేలింది. దాదాపు 67 ఏళ్ల వయసున్న చంచల్ అనే ఆ ఏనుగు ఫిబ్రవరిలోనే కార్డియాక్ అరెస్ట్‌తో మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారని NDTV పేర్కొంది. వృద్ధాప్యం వల్లే చనిపోయిందని, కలర్‌తో ఎలాంటి సంబంధం లేదని స్థానికులు తెలిపారు.

News April 5, 2026

HYD: GREAT.. గోల్డ్ మెడల్ కొట్టిన బేగం

image

ఇండియా స్కిల్స్ 2026లో లాజిస్టిక్స్ & ఫ్రైట్ ఫార్వార్డింగ్ విభాగంలో నగరానికి చెందిన మెహ్రునిషా బేగం గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఆమె ప్రయాణం కృషి, పట్టుదలకి నిదర్శనం. బేగంపేట డిగ్రీ కాలేజీ అలుమ్ని అయిన ఆమె ప్రస్తుతం కార్గోమాన్ లాజిస్టిక్స్‌లో పనిచేస్తున్నారు.