News April 10, 2025
కామారెడ్డి జిల్లాలో జొన్న పంట కొనుగోలు కేంద్రాలు

కామారెడ్డి జిల్లాలో 7వేల ఎకరాలలో జొన్న పంటను రైతులు పండించారని మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ మహేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు జొన్న పంట కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, ఆర్గొండ, కారేగావ్, గాంధారి, పిట్లం, పుల్కల్, తిమ్మానగర్, గుంకుల్, బోర్లం, పెద్దకొడప్గల్, చిన్న కోడప్గల్, ఎల్లారెడ్డి, పద్మాజీవాడి, ముదేల్లిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News April 18, 2025
వరంగల్: భద్రకాళి చెరువులోని మట్టి కావాలా?

వరంగల్ భద్రకాళి చెరువు పూడికతీతలో భాగంగా నల్లమట్టి కావాల్సిన వారు నక్కలగుట్ట ఇరిగేషన్ సర్కిల్-2 కార్యాలయంలో సంప్రదించాలని ఈఈ శంకర్ తెలిపారు. ఒక క్యూబిక్ మీటరు మట్టికి రూ.71.83 డీడీ తీసి కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇతర వివరాల కోసం సహాయ కేంద్రం నంబర్ 94406 38401ను సంప్రదించాలన్నారు. నల్లమట్టి పంట పొలాలకు ఎరువులా ఉపయోగపడుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 18, 2025
చిత్తూరు: ఒకటవ తరగతికి ఆన్‌లైన్ అడ్మిషన్లు

ఉచిత నిర్భంద విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు డీఈవో వరలక్ష్మి సూచించారు. 2025-26 విద్యాసంవత్సరంలో ఒకటో తరగతి అడ్మిషన్లకు ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఐబీ, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్ అమలు చేయాలన్నారు. ఈనెల 28వ తేదీ నుంచి మే 15వ తేదీలోపు www.cre.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలన్నారు.
News April 18, 2025
సంగారెడ్డి: పాము కాటుకు రైతు మృతి

పాముకాటుతో రైతు మృతి చెందిన ఘటన హత్నూర మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. నాగుల్ దేవుపల్లికి చెందిన దూడి అంజయ్య (46) గురువారం రాత్రి పొలానికి వెళ్లగా అక్కడ కాలుకి పాము కాటు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.