News January 20, 2026

కామారెడ్డి జిల్లాలో తగ్గుముఖం పట్టిన చలి

image

కామారెడ్డిలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. చలి తగ్గుముఖం పట్టగా జుక్కల్, గాంధారి 12.8°C, మేనూర్, లచ్చపేట 13.3, రామలక్ష్మణపల్లి 13.4, తాడ్వాయి 14.1, ఎల్పుగొండ 14.2, భిక్కనూరు 14.7, మాచాపూర్, నాగిరెడ్డిపేట 14.9, దోమకొండ, డోంగ్లి, పెద్దకొడప్గల్ 15°Cల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.

Similar News

News February 6, 2026

కశ్మీర్ మా దేశంలో భాగమవుతుంది: పాక్ ప్రధాని

image

కశ్మీర్ తమ దేశంలో అంతర్భాగమవుతుందని పాక్ PM షరీఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను గౌరవించడం, UNSC తీర్మానాలు అమలు చేయడమే J&K వివాదానికి సరైన పరిష్కారం. కశ్మీర్‌ ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నా’ అని కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా POK అసెంబ్లీలో అన్నారు. గతేడాది జరిగిన ఘర్షణల తర్వాత కశ్మీర్ వివాదం మళ్లీ రాజుకుందని చెప్పారు. ఇండియా ప్రాక్సీ టెర్రర్‌ను ఎగదోస్తోందని ఆరోపించారు.

News February 6, 2026

జమ్మికుంట: భార్యాభర్తల గొడవ.. భర్త ఆత్మహత్య

image

భార్యాభర్తల మధ్య ఆర్థిక గొడవల కారణంగా జమ్మకుంటకు చెందిన భర్త సుద్దాల శ్రీనివాస్‌(39) మనస్థాపంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సీఐ రామకృష్ణ గౌడ్‌ వివరాలిలా.. శ్రీనివాస్‌ భార్య మనమ్మ, భర్తకు తెలియకుండా తన సోదరికి రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చారు. తిరిగి ఆ సొమ్ము అడిగినా రాకపోవడంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీనివాస్‌ లుంగీతో ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు.

News February 6, 2026

నిజామాబాద్: సీఎం సభా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

image

సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ కోసం బర్దీపూర్ సభాస్థలం, స్టేజ్, హెలిప్యాడ్, ప్రవేశ మార్గాలను నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పరిశీలించారు. భద్రతా లోపాలు రాకుండా ట్రాఫిక్, పాదచారుల సౌకర్యాలు, అత్యవసర వాహన మార్గాలు, అంబులెన్స్, ఫైర్ సర్వీస్ ఏర్పాట్లను సమీక్షించారు. అధికారులకు దిశానిర్దేశం ఇచ్చారు. 1,200 మంది పోలీస్ సిబ్బంది భద్రతా ఏర్పాట్లు చేశారు.