News January 7, 2026
కామారెడ్డి జిల్లాలో తహశీల్దార్ల బదిలీలు

కామారెడ్డి జిల్లాలో MROలను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పిట్లం MRO నరేందర్ బాన్సువాడకు బదిలీ అయ్యారు. బాన్సువాడ MRO వరప్రసాద్ కలెక్టరేట్ సూపరిండెంట్‌గా, మహేందర్ పిట్లం MROగా నియమితులయ్యారు. నిజాంసాగర్ MRO భిక్షపతిని పెద్దకొడప్గల్‌కు బదిలీ చేయగా, ఇన్‌ఛార్జిగా ఉన్న అనిల్ కుమార్ ఎల్లారెడ్డి RDO కార్యాలయానికి వెళ్లారు. సవాయి సింగ్‌ను బీర్కూర్‌కు, భుజంగరావు నిజాంసాగర్‌కు బదిలీ అయ్యారు.
Similar News
News February 17, 2026
అరటి రైతులకు కాసుల పంట

అరటి సాగు రైతుల్లో ఆనందం నెలకొంది. ప్రస్తుతం మార్కెట్లో అరటి ధర రోజురోజుకూ పెరుగుతుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 11 వేల ఎకరాల్లో రైతులు అరటి సాగు చేశారు. గతంలో టన్ను ధర రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఉండగా, ప్రస్తుతం రూ.22 వేలు పలుకుతుండటం విశేషం. పెరిగిన ధరలతో పెట్టుబడి పోనూ లాభాలు వస్తాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
News February 17, 2026
తిరువూరు: విద్యార్థులకు టాబ్లెట్లు వేసిన డీవైఈవో

నులి పురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు మండలంలోని అన్ని స్కూళ్లలో మంగళవారం ఆల్బెండజోల్ టాబ్లెట్లు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో తిరువూరు MPPS ( NS) పాఠశాలలో డాక్టర్ సమక్షంలో విద్యార్థులకు డీవైఈవో శ్యాంసుందర్రావు టాబ్లెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
News February 17, 2026
WNP: ఈనెల 18న శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు

వనపర్తి జిల్లాలో ఈనెల 18న శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వ గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం 10:30 గంటలకు నాగవరంలోని బంజారా భవన్‌లో ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు, గిరిజనులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


