News April 14, 2025
కామారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం

కామారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణపరివార్‌లో ఉండే రవి ఈనెల 9న విదేశీయాత్రకు వెళ్లాడు. శనివారం మధ్యాహ్నం అతని భార్య, కొడుకు ఇంటి తాళం వేసి ఊరేళ్లారు. ఆదివారం ఇంటికి తిరిగి రాగా ఇంటి తాళాలు పగలగొట్టి కనిపించాయి. బీరువాలోని బంగారు నగలు, ఇంటి బయట ఉంచిన కారును ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News April 15, 2025
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 199 పోస్టులు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 199 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 117 SGT(ప్రాథమిక స్థాయి), 82 స్కూల్ అసిస్టెంట్ల(ద్వితీయ స్థాయి) పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టులను ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
News April 15, 2025
శ్రీకాకుళం: ఏపీ మోడల్ పాఠశాల పరీక్షల తేదీ మార్పు

ఏపీ మోడల్ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలు తేదీ ఏప్రిల్ 21కి మార్పు జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 20వ తేదీన “ఈస్టర్” పండగ ఉండటం వలన తేదీ మారుస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో గల 13 మోడల్ పాఠశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఏప్రిల్ 21కి పరీక్షలకు హాజరుకావాలని తెలిపారు.
News April 15, 2025
కెరీర్ పట్ల ఎలాంటి రిగ్రెట్ లేదు: భువనేశ్వర్

తన కెరీర్ గురించి స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సాధించిన ఘనతల పట్ల సంతృప్తిగా, కృతజ్ఞతతో ఉన్నట్లు చెప్పారు. ఎలాంటి ఫిర్యాదులు గానీ పశ్చాత్తాపం గానీ లేదన్నారు. ఇంతకుమించి తానేమీ కోరుకోవట్లేదని పేర్కొన్నారు. ఈ స్వింగ్ బౌలర్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2022 నవంబర్‌లో ఆడారు. ఈ సీజన్‌లో ఆర్సీబీ తరఫున ఆడుతున్న భువీ IPLలో అత్యధిక వికెట్లు(187) తీసిన పేసర్‌గా ఉన్నారు.