News April 25, 2025

కామారెడ్డి జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు

image

జిల్లాలో ఎండలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. గరిష్టంగా మద్నూర్ మండలంలో 44.6° నమోదవ్వగా బిచ్కుంద 44.5° దోమకొండ రామారెడ్డి 44.3° నస్రుల్లాబాద్ జుక్కల్ 44° సదాశివనగర్ గాంధారి పాల్వంచ లలో 43.9° పెద్దకొడప్గల్ 43.7° కామారెడ్డి 43.3° లింగంపేట్ నిజాంసాగర్ 43.2° తాడ్వాయి బీర్కూర్ 43° కనిష్టంగా పిట్లంలో 41.3° నమోదయ్యాయి. అధిక వేడి దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Similar News

News January 29, 2026

నిర్మల్‌లో నారీమణిలదే అధికారం

image

నిర్మల్ జిల్లా స్త్రీకి ఎంతో ప్రాధాన్యతను ఇస్తోంది. విద్యాబుద్ధులు ప్రసాదించే కొలువైన జ్ఞాన సరస్వతి అమ్మవారి నుంచి మొదలుకొని జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి, జిల్లా ఖజానా అధికారి వరకు మహిళలు పరిపాలిస్తున్నారు. అయితే తాజాగా నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ రిజర్వేషన్ మహిళకే రావడంతో అధికారమంతా నారీమణుల చేతిలోకి వెళ్లనుంది.

News January 29, 2026

రీసర్వేతో 86వేల సరిహద్దు వివాదాలు పరిష్కారం: ఎకనమిక్ సర్వే

image

AP: రాష్ట్రంలోని 6,901 గ్రామాల్లో 81 లక్షల భూకమతాలను రీసర్వే చేసినట్లు ఎకనమిక్ సర్వే వెల్లడించింది. 86 వేల సరిహద్దు వివాదాలు పరిష్కారమయ్యాయని పేర్కొంది. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిల్స్ ఇచ్చినట్లు తెలిపింది. APలో ప్రపంచ స్థాయి బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది. APతోపాటు పంజాబ్, UP, గుజరాత్‌కు విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని వెల్లడించింది.

News January 29, 2026

MNCL: ఎన్నికలకు దూరంగా వామపక్షాలు.!

image

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి వామపక్షాలు ఎటూ తేల్చుకోవడం లేదు. సీపీఎం నాయకులు పోటీ చేస్తామని ప్రకటించినప్పటికీ అభ్యర్థుల ఎంపికలో మీనమేషాలు చూస్తున్నారు. సీపీఐ నుంచి ఇప్పటికి ఎలాంటి సంకేతాలు రావడం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీ, లేదా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలతో పొత్తు విషయమై ఎలాంటి సంప్రదింపులు జరగలేదని తెలుస్తోంది. నామినేషన్ గడువు ముగిసే లోపు వామపక్షాలు ఏం చేస్తాయో చూడాలి.