News July 5, 2025
కామారెడ్డి జిల్లాలో నాట్లు షురూ.. లక్ష్యం ఎంతంటే?

కామారెడ్డి జిల్లాలో ఖరీఫ్ సీజన్ వరి నాట్లు మొదలయ్యాయి. ఈఏడాది 3.18 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అధికారులు అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి వరి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి విత్తనాలు, ఎరువుల లభ్యతపై అధికారులు దృష్టి సారించారు. రైతులకు సకాలంలో అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని DAO తిరుమల ప్రసాద్ తెలిపారు.
Similar News
News July 5, 2025
GWL: సీడ్ కంపెనీల షరతులను వ్యతిరేకిస్తూ ధర్నా

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లు పత్తి విత్తన కొనుగోలుపై విధిస్తున్న షరతులను వ్యతిరేకిస్తూ ఈనెల 7న గద్వాల పాత బస్టాండ్‌లో రైతులతో ధర్నా నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు శనివారం తెలిపారు. ఆర్గనైజర్లు ప్రారంభంలో ఫౌండేషన్ విత్తనాలు ఇచ్చి నెల రోజుల పైరు తర్వాత సీడ్ కొనుగోలు విషయంలో షరతులు విధించడం సరైనది కాదన్నారు. రైతులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు.
News July 5, 2025
నిర్మల్ రూరల్: ‘విద్యార్థుల సంఖ్య ఉన్నా పాఠశాల లేదు’

విద్యా శాఖ నియమ నిబంధనల ప్రకారం జనావాసాలకు కిలోమీటర్ పరిధిలో 20 మంది బడి ఈడు పిల్లలుంటే ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలి. కానీ నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద సుమారు 70మంది బడి ఈడు పిల్లలు ఉన్నారు. గతేడాది బడి ఏర్పాటు చేయాలని వినతులు కూడా సమర్పించారు. రాష్ట్రంలో 63, జిల్లాలో2 కొత్త పాఠశాలలు మంజూరు చేసినా ప్రభుత్వం ఇక్కడ పాఠశాల మంజూరు చేయకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.
News July 5, 2025
బాపట్లలో ఎలక్ట్రికల్ ఆటోల అందజేత

ప్రజల జీవనోపాధులు మెరుగుపరచుకోవడానికి మెప్మా శాఖ ద్వారా చీరాల మండలంలో 2, బాపట్ల మండలంలో 2 ఎలక్ట్రికల్ ఆటోలను ముద్రా రుణం కింద కలెక్టర్ వెంకట మురళి, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ లబ్ధిదారులకు అందజేశారు. ఒక్కొక్క యూనిట్ ఖరీదు రూ.3.63 లక్షలు అన్నారు. ఈ వాహనాలను రాపిడో సంస్థతో అనుసంధానించడం ద్వారా లబ్ధిదారులకు రూ.56 వేల ప్రోత్సాహకం అందజేస్తామన్నారు.