News March 27, 2024

కామారెడ్డి జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు ఎంతంటే!

image

భిక్కనూర్ 38.7, బీబీపేట్ 37.7, బాన్సువాడ 35.8, మద్నూర్ 39.2, గాంధారి 35.7, ఎల్లారెడ్డి 37.4, కామారెడ్డి 39.9, రామారెడ్డి 37.8, నసురుల్లాబాద్ 36.2, బిచ్కుంద 40.8, నాగిరెడ్డిపేట్ 37.3,పిట్లం 38.5, లింగంపేట్ 37.3, పెద్ద కొడపగల్ 39.9, మాచారెడ్డి 36.6, దోమకొండ 37.7,సదాశివనగర్ 38.0, రాజంపేట 35.2 డోంగ్లి 36.0, నిజాంసాగర్ 38.1 బీర్కూర్ 34.9, జుక్కల్ 38.2, తాడ్వాయి 39.డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News April 5, 2026

నిజామాబాద్: వడ్ల ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి

image

భీమ్గల్ మండలం బెజ్జోరా గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందాడు. వరి ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రైతు శ్రీనివాస్(45) ట్రాక్టర్ కింద పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న ఎస్సై తిరుపతి ఘటనపై కేసు నమోదు చేశారు.

News April 5, 2026

కలెక్టరేట్‌లో రేపు, ఎల్లుండి ఎన్‌సీడీ స్క్రీనింగ్

image

నిజామాబాద్ కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ హాల్‌లో ఏప్రిల్ 6, 7 తేదీలలో ఎన్‌సీడీ(అంటువ్యాధులు కానివి) స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైపర్‌టెన్షన్, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేస్తారు. కలెక్టరేట్ ఉద్యోగులు తమ ఆధార్ కార్డుతో హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

News April 5, 2026

మెండోర: సెల్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడి సూసైడ్

image

మెండోర మండలం సోన్ పేట్‌కు చెందిన పిండి మధు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. తల్లిదండ్రులు సెల్‌ఫోన్ కొనివ్వలేదని మనస్తాపానికి గురై గడ్డిమందు తాగాడు. నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుహాసిని తెలిపారు.