News December 14, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

* లింగంపేట్: రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం
* దోమకొండ: అంచనూరులో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
* భిక్కనూర్: అనారోగ్య సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
* ఎల్లారెడ్డి: పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
* నిజాంసాగర్: రెండో విడత ఎన్నికలకు భారీ బందోబస్తు
* భిక్కనూర్: జాతీయ రహదారిపై లారీ బోల్తా
Similar News
News December 19, 2025
‘అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించాలి’

జిల్లాలో వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని NPDCL సంచాలకులు మధుసూదన్ అన్నారు. శుక్రవారం ASF కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీఈ అశోక్, ఎస్ఈ ఉత్తం జాడేతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ లైన్ల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టి వినియోగదారులకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని పేర్కొన్నారు.
News December 19, 2025
రావికమతం: సీఎం ప్రారంభించనున్న స్వచ్ఛ రథాలు ఇవే..

జిల్లాలో 3 మండలాలలో స్క్రాప్ వస్తువుల సేకరణకు స్వచ్ఛ రధాలు రావికమతంలో తయారవుతున్నాయి. ఈ నెల 20న తాళ్లపాలెంలో స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ముఖ్యమంత్రి వీటిని ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వంలో రేషన్ పంపిణీకి ఇచ్చిన వాహనాలను స్వచ్ఛ రథాలు మార్పు చేశారు. అనకాపల్లి, అచ్చుతాపురం, రావికమతం మండలాలో ఈ రధాలు ఊరురా తిరిగి స్క్రాప్ వస్తువులు ఖరీదు కట్టి నగదు, కిరాణా సరుకులు ఇస్తారు.
News December 19, 2025
NZB: ప్రజల సహకారంతోనే జీపీ ఎన్నికలు ప్రశాంతం: సీపీ

ప్రజలు, పోలీసు అధికారుల మధ్య సమన్వయంతోనే GP ఎన్నికలు నజావుగా నిర్వహించామని సీపీ సాయిచైతన్య తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్డు వెలువడిన నాటి నుంచి Dec 17 వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కృషి చేసిన అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శాంతి భద్రతల కోసం కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు ఎనలేని కృషి చేశారన్నారు.


