News February 27, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి TOP న్యూస్

* KMR జిల్లాలో శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు
* KMR: పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి
* నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహించాలి: KMR కలెక్టర్
* పిట్లం: రాజీ కాలేదని కన్నతల్లిని కొట్టి చంపేశాడు
* పిట్లం: స్వర్గానికి మార్గం.. రంజాన్ మాసం
* పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన బాన్సువాడ సబ్ కలెక్టర్
* బుగ్గ రామ లింగేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న షబ్బీర్ అలీ
* శివాలయాన్ని దర్శించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే
Similar News
News February 27, 2025
వరంగల్: బాలాజీనగర్లో గోమాతకు శ్రీమంతం

గోమాతకు శ్రీమంతం నిర్వహించిన ఘటన వరంగల్ నగరంలోని కాశీబుగ్గ ఎనుమాముల రోడ్డులోని బాలాజీ నగర్‌లో బుధవారం జరిగింది. శ్రీకైలాస ఈశ్వర ప్రభక్త ఆంజనేయస్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోమాతకు శ్రీమంతం పూజా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని గోశాలలో ఉన్న వకలా మాత గోవు గర్భం దాల్చగా ఆలయ భక్తులు ఈ కార్యక్రమం చేపట్టారు. స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
News February 27, 2025
స్టేషన్ ఘనపూర్: నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి

జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. చిల్పూర్ మండలం నష్కల్ గ్రామానికి చెందిన రాజు-అపర్ణలు తమ తకూరు తపస్వి(4)తో కలిసి అపర్ణ తల్లిగారి ఊరైన స్టే.ఘ.లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో చిన్నారి ఆడుకుంటూ వెళ్లి నీటితొట్టిలో పడింది. గమనించిన అపర్ణ వెంటనే తన కూతురిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
News February 27, 2025
రికార్డు సృష్టించిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సీజన్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సీజన్‌లో ఇప్పటివరకు 11 సెంచరీలు నమోదయ్యాయి. ఒక సీజన్‌లో అన్ని జట్లు కలిపి చేసిన అత్యధిక సెంచరీలు ఇవే. గతంలో 2002, 2017లో 10 శతకాలు నమోదయ్యాయి. ఈ రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. 2006లో 7, 2000, 2009లో 6, 1998, 2004లో 4, 2013లో 3 శతకాలు నమోదయ్యాయి. కాగా ఇవాళ జరిగిన ఇంగ్లండ్-అఫ్గానిస్థాన్ మ్యాచులో 2 సెంచరీలు వచ్చాయి. జో రూట్, ఇబ్రహీం జద్రాన్ శతకాలు బాదారు.