News March 18, 2025
కామారెడ్డి జిల్లాలో పలువురు తహశీల్దార్ల బదిలీ

KMR జిల్లాలో MROలు బదిలీ అయ్యారు. సురేశ్ బిచ్కుంద నుంచి రాజంపేట, రేణుక చౌహన్ డోంగ్లి నుంచి లింగంపేట, హిమబిందు జుక్కల్ నుంచి పల్వంచకు, వేణుగోపాల్ పిట్లం నుంచి బిచ్కుంద, మహేందర్ ఎల్లారెడ్డి నుంచి జుక్కల్ బదిలీ అయ్యారు. నరేందర్ గౌడ్ లింగంపేట్ నుంచి డోంగ్లి, సతీష్ రెడ్డి గాంధారి నుంచి మాచారెడ్డి, అనిల్ కుమార్ రాజంపేట నుంచి పిట్లం, సువర్ణ రామారెడ్డి నుంచి DAO సబ్ కలెక్టర్ బాన్సువాడకు నియమించారు.
Similar News
News December 18, 2025
చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోంది: జగన్

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చేపట్టిన ఉద్యమం గ్రాండ్ సక్సెస్ అయిందని YCP చీఫ్ జగన్ పేర్కొన్నారు. ‘CBN గ్రాఫ్ పడిపోతోంది. దీనికి కలెక్టర్లే కారణమని ఆయన అనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ప్రైవేటీకరణే స్కామ్ కాగా సిబ్బందికి రెండేళ్ల పాటు జీతాలు GOVT ఇవ్వాలనుకోవడం మరో పెద్ద స్కామ్. వీటిపై కోర్టుకెళ్తాం. YCP అధికారంలోకి రాగానే వీటిని రద్దుచేస్తాం. బాధ్యులను 2 నెలల్లో జైల్లో పెడతాం’ అని హెచ్చరించారు.
News December 18, 2025
నంద్యాల జిల్లా ఇంఛార్జ్‌గా సీహెచ్ శ్రీధర్

రాష్ట్రంలోని 5 జిల్లాలకు జిల్లా ఇంఛార్జ్‌లుగా సీనియర్ IAS అధికారులను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల జిల్లా ఇంఛార్జ్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి సీహెచ్ శ్రీధర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లాలోని అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాల అమలు తీరును ఈయన స్వయంగా పర్యవేక్షించనున్నారు.
News December 18, 2025
తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

నేషనల్ హెల్త్ మిషన్ తూర్పుగోదావరి జిల్లాలో 35 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ, ఇంటర్, డిప్లొమా, PG, PGDCA, బీఫార్మసీ, డీఫార్మసీ, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.300, SC, STలకు రూ.200. దివ్యాంగులకు ఫీజు లేదు. వెబ్సైట్: eastgodavari.ap.gov.in


