News March 30, 2024
కామారెడ్డి జిల్లాలో భానుడి భగభగలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు ఠారేత్తిస్తున్నాయి. మార్చి మెుదటి వారం నుంచి భానుడి భగభగలు మెుదలయ్యాయి. మార్చి ముగియకముందే కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరువైంది. దీంతో కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలకు గిరాకీ పెరిగింది. బిచ్కుంద మండలంలో 41.9, దోమకొండ 40.5, రామారెడ్డి 40.4, పుల్కల్‌లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యవసర పరిస్థితుల్లోనే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News September 8, 2025
నిజామబాద్: ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సీపీ సాయి చైతన్య అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వారి ఫిర్యాదులను విని పరిష్కారానికి సంబంధిత పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా తమ ఫిర్యాదులు అందించవచ్చన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. ప్రజావాణిలో మొత్తం 11 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు.
News September 8, 2025
నిజామాబాద్: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: సీపీ

రాజీ మార్గమే ఉత్తమ మార్గమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. సెప్టెంబర్ 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ట్రాఫిక్, చిన్నపాటి క్రిమినల్, సివిల్ వివాదాల కేసులను లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చని సీపీ తెలిపారు. కేసుల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
News September 8, 2025
కుప్పం బయలుదేరిన నిజామాబాద్ ప్రభుత్వ ఉపాధ్యాయులు

నిజామాబాద్ జిల్లాకు చెందిన 41 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు గురువారం కుప్పం బయలుదేరారు. డీఈఓ అశోక్ ఆధ్వర్యంలో వీరంతా అగస్త్య ఫౌండేషన్ నిర్వహించే ‘మేక్ యువర్ ఓన్ ల్యాబ్’ వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో సైన్స్, మ్యాథ్స్‌లో ప్రయోగాత్మక పద్ధతులపై శిక్షణ ఇస్తారు. ఈ బృందానికి డీఈఓ అశోక్ వీడ్కోలు పలికారు.