News November 11, 2025
కామారెడ్డి జిల్లాలో భూముల రీసర్వేకు కలెక్టర్ గ్రీన్ సిగ్నల్

కామారెడ్డి జిల్లాలోని 16 మండలాల పరిధిలో భూముల రీసర్వే పనులను చేపట్టడానికి జిల్లా కలెక్టర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. భూములకు సంబంధించిన స్వంతదారులు, రిజిస్టర్ దారులు సరిహద్దులు గుర్తించడానికి అవసరమైన సమాచారంతో తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీనివాస్ పర్యవేక్షణలో ఈ రీసర్వే జరుగుతుందని కలెక్టర్ ప్రకటించారు.
Similar News
News November 11, 2025
NRPT: ‘జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలి’

క్రీడాకారులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి జిల్లాకు పేరు తీసుకురావాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో నారాయణపేట మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులు క్రికెట్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం అదనపు కలెక్టర్ వివిధ అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను అభినందించారు.
News November 11, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జనగామ కలెక్టరేట్లో ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు
> రిటైర్డ్ ఉపాధ్యాయులకు వెంటనే బెనిఫిట్స్ అందించాలని దీక్ష
> క్రీడలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి: కలెక్టర్
> జనగామ: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
> పాలకుర్తి: సోమేశ్వర ఆలయానికి రూ.70 వేల శక్తి ఆయుధం కానుక
> స్టేషన్ ఘనపూర్‌లో తెగిన రోడ్డు.. ఐదు గ్రామాల ప్రజల ఇక్కట్లు
News November 11, 2025
విశాఖ: అబార్షన్ కిట్ అమ్ముతున్న మెడికల్ షాప్‌పై కేసు

డాక్టర్ మందులు చీటీ లేకుండా గర్భాన్ని తొలగించేందుకు వాడే మందులను అమ్ముతున్న మెడికల్ షాప్‌పై విశాఖ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడులు చేశారు. సీపీ సూచనలతో గోపాలపట్నంలోని దర్విన్ ఫార్మసీపై మంగళవారం దాడులు చేయగా ఆరు కిట్లు స్వాధీనం చేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు. దుకాణంపై కేసు నమోదు చేసి మందులను డ్రగ్ కంట్రోలర్ అప్పగిస్తామని వెల్లడించారు.


