News March 31, 2025

కామారెడ్డి జిల్లాలో మండుతున్న ఎండలు

image

కామారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం ఉష్ణోగ్రత వివరాలను అధికారులు వెల్లడించారు. బిచ్కుంద మండలంలో అత్యధికంగా 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత, నస్రుల్లాబాద్ రామారెడ్డి మద్నూర్‌లో 40.9, కామారెడ్డి నిజాంసాగర్, గాంధారి మండలాల్లో 40.7, దోమకొండ, పాల్వంచ మండలాల్లో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.

Similar News

News September 17, 2025

హత్య కేసులో దంపతులకు పదేళ్ల జైలు

image

పెద్దాపురం మండలం జి.రాగంపేటలో జరిగిన హత్య కేసులో భార్యాభర్తలకు పదేళ్ల జైలుశిక్ష పడినట్లు సీఐ విజయశంకర్ తెలిపారు. 2022లో ఆదిన ప్రసాద్, అతని భార్య లక్ష్మి పాలాని కలిసి మంగను ఇంటి మెట్లపై నుంచి తోసేశారు. దీంతో ఆమె మృతి చెందింది. మృతురాలి కూతురు పాపారాణి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ పి. శివశంకర్ కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో కోర్టు వారికి పదేళ్ల జైలు శిక్ష విధించింది.

News September 17, 2025

వికారాబాద్: చిరుత సంచారంతో భయం భయం

image

పెద్దెముల్ మండలం తట్టేపల్లి సిద్ధన్నమడుగు తాండ సమీపంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు గుర్తించారు. జంతువు పాదముద్రలను చూసిన వారు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి సరస్వతి సిబ్బందితో కలిసి వచ్చి పాదముద్రలను పరిశీలించి అవి చిరుతపులివేనని ధృవీకరించారు. స్థానికులను రాత్రివేళలు లేదా ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

News September 17, 2025

JNTUలో 198 ఎంటెక్ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు

image

JNTU యూనివర్సిటీలో ఎంటెక్ విభాగానికి సంబంధించి స్పాన్సర్ క్యాటగిరీలో స్పాట్ అడ్మిషన్లకు అధికారుల సిద్ధమయ్యారు. ఈ నెల 18 నుంచి 20 వరకు యూనివర్సిటీతో పాటు అనుబంధ కళాశాలలో 198 సీట్లకు స్పాట్ అడ్మిషన్లను నిర్వహించనున్నట్లు అడ్మిషన్ డైరెక్టర్ బాలు నాయక్ తెలిపారు. ఉ.10 గంటల నుంచి సా.6 గంటల వరకు అడ్మిషన్లకు సంబంధించి ప్రక్రియ నిర్వహిస్తామని ఆయన అన్నారు.