News April 8, 2025
కామారెడ్డి జిల్లాలో మండుతున్న ఎండలు

జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలను అధికారులు వెల్లడించారు. జుక్కల్ 40.8 డిగ్రీలు, బీర్కూర్ 40.7, గాంధారి 40.5, దోమకొండ 40.4, డోంగ్లి 40.2, మద్నూర్, నస్రుల్లాబాద్ 40.1, కామారెడ్డి 40, నిజాంసాగర్, బిక్నూర్ 39.9, బాన్సువాడ 39.8, రామారెడ్డి, బిచ్కుంద, రాజంపేట, లింగంపేట్ మండలాల్లో 39.7, బిబిపేట్, పిట్లంలో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు.
Similar News
News April 17, 2025
ఫెయిలైన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు

AP: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో చదువుతూ ఇంటర్ ఫెయిలైన, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి వేసవిలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ తరగతులు నిర్వహిస్తారు. ఇందుకోసం కేజీబీవీ హాస్టళ్లను ఉపయోగించుకోవాలని భావించింది. కాగా ఆదర్శ పాఠశాలల్లో ఫస్టియర్‌లో 44%, సెకండ్ ఇయర్‌లో 18% శాతం మంది ఫెయిలయ్యారు.
News April 17, 2025
కాంగ్రెస్ అంటే మోసగాళ్ల పార్టీ: జగదీశ్ రెడ్డి

కాంగ్రెస్ అంటే మోసగాళ్ల, ఢీల్లీ గులాముల పార్టీ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈనెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని దేవరకొండలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏపీ సీఎం చంద్రబాబు చేతుల్లోకి పోతుందన్నారు. కాంగ్రెస్‌లో వాళ్లు వాళ్లే కొట్టుకుంటున్నారని ఏద్దేవా చేశారు.
News April 17, 2025
అలా చేస్తే రూ.10 లక్షల ఫైన్: నెల్లూరు జేసీ

కాల్షియం కార్బైడ్ ఉపయోగించి కృత్రిమ పద్ధతిలో పండ్లను మగ్గపెట్టే పండ్ల వ్యాపారులకు రూ.10 లక్షల జరిమానా విధిస్తామని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ హెచ్చరించారు. ఏడు శాఖల అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. మామిడి పండ్ల సీజన్ ప్రారంభమవుతోందని, అధికారులు తనిఖీలు వేగవంతం చేయాలన్నారు. ఎక్కడైనా కాల్షియం కార్బైడ్ వినియోగిస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు.