News April 14, 2025
కామారెడ్డి జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన

మంత్రి జూపల్లి కృష్ణారావు ఈనెల 15న ఉమ్మడి NZB జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.10.30 గంటలకు KMR జిల్లా కలెక్టరేట్‌లో వ్యవసాయ, సివిల్ సప్లై, తదితర శాఖలపై సమీక్షిస్తారు. అనంతరం ఆయన NZB జిల్లా ఆర్మూర్‌కు చేరుకొని, సన్నం బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేస్తారు. సా. 4 గంటలకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తారు. గుండ్ల చెరువుకు మిని ట్యాంక్ బండ్‌గా అభివృద్ధికి పునాది రాయి వేయనున్నారు.
Similar News
News April 13, 2026
కొండవీడు కోటపై ‘నైట్ క్యాంపింగ్’.. ప్రకృతి ఒడిలో రాత్రి బస!

పల్నాడు జిల్లాలోని చారిత్రక కొండవీడు కోటపై పర్యాటకుల కోసం అటవీశాఖ నైట్ టెంట్ క్యాంపింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో రాత్రి బసతో పాటు మ్యూజికల్ నైట్, క్యాంప్ ఫైర్, సూర్యోదయ వీక్షణ, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. ధర పెద్దలకు రూ. 2,000, ఎనిమిదేళ్లలోపు పిల్లలకు రూ. 1,000గా నిర్ణయించారు. వీటితో పాటు ట్రెక్కింగ్, బోటింగ్ వంటి అడ్వెంచర్ క్రీడలు కూడా పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచనున్నాయి.
News April 13, 2026
PHOTO: కండలు తిరిగిన శరీరంతో Jr.NTR

‘డ్రాగన్’ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకుంటున్నారు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ కండలు తిరిగిన బాడీ ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది క్షణాల్లోనే వైరలైంది. తారక్ బాడీ బాక్సాఫీస్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
News April 13, 2026
చర్చలు విఫలం.. మార్కెట్లలో బ్లడ్‌బాతేనా?

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడం, క్రూడాయిల్ ధర పెరగడంతో భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. యుద్ధం ఇంకా కొనసాగనుండటంతో ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలకే మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జపాన్ నిక్కీ-225.. 0.80%, టోపిక్స్ 0.42% నష్టపోయాయి. సౌత్ కొరియా కోప్సి 1.83%, కొస్దాక్ 1.43%, హాంగ్‌కాంగ్ హాంగ్ సెంగ్, ఆస్ట్రేలియా S&P/ASX 200 మైనస్‌లో ట్రెండ్ అవుతున్నాయి.


