News January 19, 2025
కామారెడ్డి జిల్లాలో మరింత తగ్గుదలకు ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. ఆదివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జిల్లాలో అత్యల్పంగా గాంధారి 11.6,జుక్కల్ 11.7, మేనూర్ 11.9, సర్వాపూర్ 12.5, డోంగ్లి, బీబీ పేట్‌లో 12.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. చలి ప్రభావం ఎక్కువ అవుతుంది నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News January 8, 2026
విద్యార్థులు ఇష్టపడి చదవాలి: పెద్దపల్లి డీఈఓ

10వ తరగతిలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించుటకు ఇష్టపడి చదవాలని డీఈఓ శారద సూచించారు. గురువారం రంగంపల్లి బీసీ హాస్టల్లో జిల్లాలోని బీసీ హాస్టళ్లలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విషయ నిపుణుల సలహాలు, సూచనలతో నూరు శాతం ఫలితాలు సాధించాలని సూచించారు.
News January 8, 2026
ACB కేసుల్లో దర్యాప్తు జరగాల్సిందే: సుప్రీంకోర్టు

AP: ACB నమోదు చేసిన FIRలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. ACB సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్(CIU)-విజయవాడ ఫైల్ చేసిన అన్ని FIRలపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. 6నెలల్లో తుది నివేదిక ఇవ్వాలని, ప్రతివాదులను అరెస్ట్ చేయొద్దని సూచించింది. ACB CIUకు నోటిఫైడ్ పోలీస్ స్టేషన్ హోదా లేదనే కారణంతో FIRలను హైకోర్టు గతంలో కొట్టేసింది. దీన్ని SCలో ACB సవాలు చేసింది.
News January 8, 2026
వరంగల్ అభివృద్ధిపై బల్దియా ఆఫీసులో రివ్యూ

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వరద కాలువల పునరుద్దరణపై రివ్యూ నిర్వహించారు. మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, ప్రకాశ్ రెడ్డి, నాగరాజు, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అధికారులు రివ్యూలో పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఏర్పాటుకు పూర్తి స్థాయి డీపీఆర్ సిద్ధం చేయాలని ఎమ్మెల్యేలు అన్నారు.


