News January 4, 2026

కామారెడ్డి జిల్లాలో మళ్లీ పెరుగుతున్న చలి ప్రభావం

image

కామారెడ్డి జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను అధికారులు వెల్లడించారు. లచ్చపేట 13°C, గాంధారి 13.9, దోమకొండ 14, ఎల్పుగొండ 14.3, ఇసాయిపేట 14.5, భిక్కనూరు 14.7, జుక్కల్ 14.9°C ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ఆధారంగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 2 రోజులుగా పొగమంచు అధికంగా ఏర్పడి, చలి తగ్గగా, తిరిగి చలి ప్రభావం ఎక్కువవుతుందని తెలిపారు.

Similar News

News February 4, 2026

వికారాబాద్: డిజిటల్ డోర్ నంబర్ల కేటాయింపు

image

కొడంగల్ మండలం అంగడిరాయిచూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ధర్మాపూర్‌లో మంగళవారం డిజిటల్ ఆన్‌లైన్ డోర్ నంబర్‌ను కేటాయిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో ఇకపై గ్రామంలోని ప్రతి డోర్‌పైన నంబర్ కనిపించనుంది. ఈ సంఖ్య ఆన్‌లైన్‌లో సైతం నమోదు చేస్తున్నారు. ఇకపై ప్రజలు ఇంటిపన్నును మీసేవా కేంద్రాల్లో కూడా పేమెంట్ చేసే అవకాశాన్ని కల్పించింది.

News February 4, 2026

ఆన్‌లైన్ గేమ్ పిచ్చి: ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

image

ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు ఘజియాబాద్‌(UP)లో వారు నివసిస్తున్న బిల్డింగ్ 9వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు. బుధవారం వేకువజామున 2గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. కరోనా నుంచి వీరు ఒక కొరియన్ టాస్క్ బేస్డ్ గేమ్‌కు అడిక్ట్ అయ్యారు. చదువు మానేసి మరీ గేమ్స్ ఆడుతుండటంతో పేరెంట్స్ మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ముగ్గురూ ఒకేసారి బిల్డింగ్ పైనుంచి దూకేశారు.

News February 4, 2026

పులిని బంధిస్తాం: మంత్రి నాదెండ్ల

image

తొర్రేడు, గాడాల మీదుగా బుధవారం దివాన్ చెరువు ప్రాంతానికి పెద్దపులి సంచరిస్తోంది. పులి కదలికలను కనిపెట్టడం అటవీ శాఖ అధికారులకు సవాల్‌గా మారింది. దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ.. పులిని బంధించి సురక్షితంగా అడవికి తరలిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.