News December 21, 2025

కామారెడ్డి జిల్లాలో మాంసం ధరలు

image

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఆదివారం మటన్, చికెన్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. మటన్ కిలో రూ.800, చికెన్ కిలో రూ.250, లైవ్ కోడి కిలో రూ.150 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. చికెన్, మటన్ గత వారం ధరలే ఈ వారం కూడా కొనసాగుతున్నాయి.

Similar News

News December 28, 2025

వణికిస్తున్న చలి.. పెరిగిన వైరల్ జ్వరాల ఉద్ధృతి

image

ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14-16 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. వేకువజామున వీస్తున్న చలిగాలులతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల జిల్లావ్యాప్తంగా వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు జలుబు, దగ్గు, జ్వరంతో ఆసుపత్రుల బాట పడుతున్నారు.

News December 28, 2025

కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం.. రేవంత్ విషెస్

image

TG: కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ‘భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ మహారథి. జాతి నిర్మాణ సారథి. ప్రజాస్వామ్య ఆకాంక్షల వారధి. పేదల ఆకలి తీర్చిన పెన్నిధి. 140 కోట్ల భారతీయుల ప్రతినిధి. 141 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. కార్యకర్తల చెమట చుక్కలే సిరా చుక్కలై రాసిన చరిత్ర కాంగ్రెస్’ అని ట్వీట్ చేశారు.

News December 28, 2025

మిరపలో ఆకుముడత నివారణకు చర్యలు

image

మిరప నారును పొలంలో నాటిన 15 రోజుల తర్వాత ప్రతి 2 వారాలకు ఒకసారి లీటరు నీటికి థయామిథాక్సామ్ 0.3గ్రా, ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా., పిప్రోనిల్ గ్రాన్యూల్స్ 0.2 గ్రా, పెగాసస్ 1.5mlలలో ఏదో ఒక మందును కలిపి పిచికారీ చేయాలి. వీటితో పాటు 10,000 ppm వేప మందును లీటరు నీటికి 2ml కలిపి స్ప్రే చేయాలి. ముడత వలన బలహీనపడ్డ మొక్కలకు లీటరు నీటికి 2 గ్రాముల ఫార్ములా- 4 మరియు 19:19:19ను నెల రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి.