News December 17, 2025
కామారెడ్డి జిల్లాలో మూడో విడత తొలి ఫలితం

నస్రుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంప్ సర్పంచ్ స్థానంపై ఉత్కంఠకు తెరపడింది. అంకోల్ క్యాంప్ సర్పంచ్‌గా అనిత-రాములు విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అనితకు 209 మెజారిటీ వచ్చింది. తన సమీప ప్రత్యర్థి సావిత్రికి 36 ఓట్లు వచ్చాయి. 3 ఓట్లు చెల్లలేదు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
Similar News
News December 26, 2025
కోనసీమలో ఎరువుల సరఫరాపై కలెక్టర్ ఆరా!

జిల్లా రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని, ఎరువుల సరఫరాలో ఎటువంటి జాప్యం జరగరాదని స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News December 26, 2025
NTR జిల్లాలో కొండెక్కిన కోడిగుడ్డు ధర..!

కోడిగుడ్డు ధర కొండెక్కిందని ప్రజలు అంటున్నారు. చందర్లపాడు తదితర మండలాలలో నేడు గుడ్డు ధర ఒక్కటి రూ.7.55కు చేరిందని స్థానికులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో భాగమైన గుడ్లు ధరలు పెరగడంతో కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు వాపోతున్నారు. మేత ధరలు, రవాణా వ్యయాలు పెరగడమే గుడ్డు ధరలు పెరగడానికి ప్రధాన కారణమని వ్యాపారులు పేర్కొన్నారు. మరి మీ ప్రాంతంలో గుడ్డు ధర ఎంతో కామెంట్ చేయండి..!
News December 26, 2025
డిసెంబర్ 31నే పింఛన్ల పంపిణీ: అనంతపురం కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జిల్లాలోని 2,78,388 మందికి రూ.124.47 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 31న ఉదయం 6:30 గంటల నుంచి సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు అందజేయాలని ఆదేశించారు. జనవరి 1న న్యూ ఇయర్ కావడంతో ఒకరోజు ముందే పంపిణీ చేస్తున్నారు.


