News May 2, 2024

కామారెడ్డి జిల్లాలో యాక్సిడెంట్

image

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామ శివారులో ఈరోజు జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సిరిసిల్ల నుంచి కామారెడ్డి వైపు వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నర్సయ్య మృతిచెందగా అతడి భార్య లలిత, దిలీప్‌ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

Similar News

News January 13, 2025

NZB: ఇద్దరు మహిళలు సూసైడ్ అటెంప్ట్.. కాపాడిన పోలీసులు

image

బాసర గోదావరిలో ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఎస్ఐ గణేశ్ తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన మహిళతో పాటు మహరాష్ట్రలోని నాందేడ్ జిల్లా చెందిన మరో మహిళ గోదావరిలో దూకేందుకు యత్నించగా పోలీసులు కాపాడారు. NZBకు చెందిన మహిళా కుటుంబ సభ్యులతో గొడవపడి గోదావరిలో దూకేందుకు యత్నించగా అటుగా వెళ్తున్న ఎస్సై ఆమెను అడ్డుకున్నారు. నాందేడ్ కు చెందిన మహిళను మహిళ కానిస్టేబుల్ అడ్డుకున్నారు.

News January 13, 2025

మోపాల్: కారు – బైక్ ఢీ.. వ్యక్తి మృతి

image

ఆదివారం కారు- బైక్ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. మోపాల్ SI యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. బోర్గం(P) సంజీవరెడ్డికాలనీకి చెందిన విజయ్ కుమార్(48) మోపాల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా పెట్రోల్ బంక్ వద్ద కారు బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News January 13, 2025

నిజామాబాద్ జిల్లా వాసికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

image

భూవనేశ్వర్‌లోని ఉత్కల్ విశ్వవిద్యాలయంలో 2024 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాలను అందజేశారు. ముఖ్య అతిథిగా ఆంగ్ల కవి, రచయిత జెర్రీ పింటో హాజరయ్యారు. తెలుగు భాష నుంచి నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లికి చెందిన రమేశ్ కార్తీక్ నాయక్ తన తొలి కథల సంపుటి ‘ఢావ్లో- గోర్ బంజారా కథలు’ పుస్తకానికి అవార్డు అందుకున్నారు. ఈ పురస్కారం అందుకున్న తొలి గిరిజన తెలుగు రచయిత కావడం విశేషం.