News January 9, 2026

కామారెడ్డి జిల్లాలో రాత్రి ACCIDENT

image

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. లింగంపేట మండలం సూరాయిపల్లికి చెందిన కూలీలు వరినాట్లు వేసేందుకు ఆటోలో భిక్కనూర్ మండలం అంతంపల్లికి వెళ్లారు. వారు తిరిగి వస్తుండగా జిల్లా కేంద్రంలో ముందున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Similar News

News February 5, 2026

ఇండియాకు ఎక్కడి నుంచైనా ఆయిల్ కొనే స్వేచ్ఛ ఉంది: రష్యా

image

అమెరికాతో ట్రేడ్ డీల్‌లో భాగంగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను ఇండియా ఆపేస్తుందన్న వార్తలపై మాస్కో సానుకూలంగా స్పందించింది. ‘ప్రపంచవ్యాప్తంగా మాతో పాటు చాలా మంది చమురు ఎగుమతిదారులు ఉన్నారు. ఢిల్లీకి రష్యా మాత్రమే సప్లయర్ కాదు. ఎక్కడి నుంచైనా ఆయిల్ కొనే స్వేచ్ఛ ఇండియాకు ఉంది. ఈ డీల్‌ను మేమేమీ కొత్తగా చూడట్లేదు’ అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు.

News February 5, 2026

HYD: వర్క్ STRESSతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ SUICIDE

image

మియాపూర్‌లోని BKఎన్‌క్లేవ్‌లో ఓ యువకుడు గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. AP అమలాపురానికి చెందిన సతీశ్(31) గచ్చిబౌలిలోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేస్తున్నాడు. పనిఒత్తిడి తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. సతీశ్‌కు ఏడాది క్రితం వివాహం కాగా భార్య సొంతూరుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

News February 5, 2026

MDK: టీచర్‌గా మెప్పించి సూసైడ్ చేసుకుంది!

image

పాఠశాలలో నిర్వహించిన సెల్ఫ్ గవర్నమెంట్ డేలో టీచరై ఉత్తమ ప్రతిభ కనభరిచింది. అందరితో కలిసి మెలిసి మాట్లాడింది. సాయంత్రం ఇంటికి వచ్చి పనులన్నీ చేసింది. ఏమైందో తెలిదు కానీ తూప్రాన్ మండలం కోనాయపల్లి(PB)కి చెందిన పదో తరగతి విద్యార్థిని సుస్మిత(15) <<19052796>>సూసైడ్<<>> చేసుకుంది. సుస్మిత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు శవాన్ని పోస్టుమార్టం కోసం తూప్రాన్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.