News October 7, 2025
కామారెడ్డి జిల్లాలో వర్షపాతం వివరాలు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. ఇసాయిపేట 19.8 మి.మీ., ఎల్పుగొండ 19.3, సదాశివనగర్ 15.3, బిక్కనూరు 14.5, తాడ్వాయి 12, పిట్లం, మాక్దూంపూర్ 10.5, జుక్కల్ 9.5, మాచాపూర్, రామలక్ష్మణపల్లిలలో 9.3, హాసన్ పల్లి 9, లింగంపేట 8, సోమూరు 7.8, బిచ్కుంద 7.5, నాగిరెడ్డిపేట 7, IDOC 6.8, సర్వాపూర్ 6.5, పెద్ద కొడప్గల్ 6.3, బీబీపేట 6 మి.మీ. నమోదయ్యాయి.
Similar News
News April 17, 2026
‘గరుడ’ విష్ణుమూర్తి వాహనం ఎలా అయ్యాడు?

వినత కుమారుడైన గరుడుడు తన తల్లిని బానిసత్వం నుంచి విడిపించడానికి కద్రువ కోరిక మేరకు దేవలోకం నుంచి అమృతాన్ని తెస్తాడు. అపారమైన శక్తి ఉన్నా, అమృతంపై ఆశ పడడు. తల్లి కోసం నిస్వార్థంగా పనిచేసిన ఆయన ధైర్యం మహావిష్ణువును మెప్పించాయి. దీంతో విష్ణుమూర్తి, అతనికి చిరంజీవిత్వం ప్రసాదించి తన వాహనంగా, ధ్వజంగా స్వీకరించారు. గరుడుడు సముద్రాలను దాటగలడు. వేగవంతుడు. విష్ణు సాయం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.
News April 17, 2026
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..!

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం పసుపు (పిల్ల కొమ్ము) గరిష్ఠ ధర రూ.12,400, కనిష్ఠ ధర రూ.8,000గా నమోదైంది. పసుపు (మండ కొమ్ము) గరిష్ఠ ధర రూ.11,655, కనిష్ఠం రూ.8,000 ఉండగా, కందులు రూ. 6,768, చిక్కుడు రూ. 4,611, వరి (1010) రూ. 1,752 చొప్పున పలికాయి. మొక్కజొన్న గరిష్ఠ ధర రూ. 1,857 కనిష్ఠ ధర రూ. 1,801గా పలికాయని మార్కెట్ అధికారులు. మార్కెట్‌కు ఈరోజు మొత్తం 652 క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయన్నారు.
News April 17, 2026
మెట్‌పల్లి మార్కెట్లో పసుపు ధరలు ఇలా..!

మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో గురువారం పలికిన పసుపు ధరలు ఇలా ఉన్నాయి. పసుపు కాడి క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 14,516, కనిష్ఠం రూ. 9,009, పసుపు గోళ గరిష్ఠం రూ. 13,566, కనిష్ఠం రూ. 8,585, పసుపు చూర గరిష్ఠం రూ. 11,555, కనిష్ఠం రూ. 8,181గా పలికాయి. ఈ రోజు మార్కెట్‌కు మొత్తం 956 క్వింటాళ్ల పసుపు అమ్మకానికి వచ్చిందని మార్కెట్ అధికారులు తెలిపారు.


