News December 27, 2025

కామారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణహత్య..!

image

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం మోటాట్‌పల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఎర్రరాజు(32) హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున గొడ్డలితో నరికి చంపారని స్థానికులు తెలిపారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 27, 2025

భారీ స్కాంలో చిత్తూరు జిల్లా ఫస్ట్.!

image

చిత్తూరు జిల్లాలో నకిలీ GST స్కాంలో రూ.118.70 కోట్ల మేర అవినీతి జరిగినట్లు అధికారులు తేల్చారు. వివిధ కంపెనీల పేరుతో నకిలీ బిల్లులు సృష్టించి రూ.కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కొల్లగొట్టారు. వాటి వివరాలు: ☞ లలిత ట్రేడర్స్-రూ.25.43 కోట్లు ☞ RP ఎంటర్ప్రైజెస్-రూ.15.98కోట్లు ☞ తాజ్ ట్రేడర్స్-రూ.13.37 కోట్లు ☞మహాదేవ్ ఎంటర్ప్రైజెస్- రూ.9.54 కోట్లు. మరింత సమాచారం కోసం <<18683267>>క్లిక్<<>> చేయండి.

News December 27, 2025

హుస్నాబాద్: పుత్ర శోకం తట్టుకోలేక తండ్రి మృతి

image

వారం రోజుల వ్యవధిలోనే తండ్రి, కుమారుడు మృతి చెందడంతో హుస్నాబాద్‌ మం. గాంధీనగర్‌లో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌రావు(53) ఈనెల 20న గుండెపోటుతో మరణించారు. చేతికందిన కొడుకు దూరం కావడాన్ని తండ్రి చొక్కారావు(85) తట్టుకోలేకపోయారు. కొడుకు అంత్యక్రియల రోజే స్పృహతప్పి పడిపోయిన ఆయన, శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు మరణించడంతో ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి.

News December 27, 2025

ఉపవాసంలో ఉపశమనం కోసం..

image

ఉపవాస సమయంలో అలసట రాకుండా ఉండాలంటే సగ్గుబియ్యం, పన్నీర్ వంటి ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్ సహజ సిద్ధమైన శక్తిని ఇస్తాయి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు తీసుకోవడం చాలా అవసరం. తక్కువ ఉప్పు, తక్కువ నూనెతో చేసిన వంటకాలు ఆరోగ్యానికి మంచివి. ఇటువంటి మితమైన, పోషకాలున్న ఆహారం తీసుకోవడం వల్ల శక్తి కోల్పోకుండా ఉపవాసాన్ని విజయవంతంగా పూర్తి చేయవచ్చు.