News December 14, 2025
కామారెడ్డి జిల్లాలో సర్పంచిగా తొలి విజయం

గాంధారి మండలం తిప్పారం సర్పంచిగా మధుసూదన్ రావు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 36 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు అధికారులు తెలిపారు. తిప్పారం పంచాయతీ పీఠాన్ని కైవసం చేసుకుని గాంధారి మండలంలో సర్పంచిగా గెలిచి బోణి కొట్టారు. ఇది వరకే 8 వార్డు సభ్యులు ఇక్కడ ఏకగ్రీవమయ్యారు.
Similar News
News December 17, 2025
OFFICIAL: నాలుగో టీ20 రద్దు

IND-SA నాలుగో T20 రద్దయింది. లక్నోలో AQI అతి ప్రమాదకర స్థాయిలో 391గా రికార్డైంది. పలుమార్లు పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు ఆట సాధ్యం కాదని ప్రకటించారు. కాగా ఇప్పటికే జరిగిన 3 టీ20ల్లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఐదో టీ20 ఈ నెల 19న అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో జరగనుంది. కాగా లక్నోలో పొగమంచు, పొల్యూషన్ తీవ్రంగా ఉండటంతో మ్యాచ్ రద్దు అవుతుందని గంట క్రితమే <<18596625>>Way2News అంచనా<<>> వేసింది. ఇప్పుడదే నిజమైంది.
News December 17, 2025
తిరుపతి: స్టార్టప్ వ్యవస్థ బలోపేతంపై ఒప్పందం

శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ, SSIIE-టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ (TBI), రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) తిరుపతి మధ్య స్టార్టప్ వ్యవస్థ బలోపేతంపై ఒప్పందం కుదుర్చుకున్నట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఈ సందర్భంగా VC ఉమా మాట్లాడుతూ.. ఆవిష్కరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇన్నోవేటివ్, డీప్ టెక్ ఉత్పత్తుల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఈ మేరకు MOUపై సంతకాలు చేశారు.
News December 17, 2025
దోమలో లాటరీ సర్పంచ్

దోమ మండలం పాలేపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులకు 469 సమాన సంఖ్యలో ఓట్లు రావడంతో ఫలితం తేలలేదు. ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారులు లాటరీ పద్ధతిని అమలు చేశారు. అధికారుల సమక్షంలో నిర్వహించిన లాటరీలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన బచ్చి గారి సుజాత విజయం సాధించారు.


