News January 3, 2026
కామారెడ్డి జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు

కామరెడ్డి జిల్లాలో గడచిన 24 గంటల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. లచ్చపేట 15.3°C, రామలక్ష్మణపల్లి, దోమకొండ, తాడ్వాయి 15.5, ఎల్పుగొండ 15.8, మాచాపూర్, నాగిరెడ్డిపేట 15.9, గాంధారి 16, ఇసాయిపేట 16.1, జుక్కల్ 16.3, భిక్కనూర్ 16.4, సదాశివనగర్, పాత రాజంపేట 16.5°Cల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శీతల గాలులు విపరీతంగా వీస్తూ చలిని తలపిస్తున్నాయి.
Similar News
News January 5, 2026
సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్

చిత్తూరు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కొనసాగుతోంది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను కలెక్టర్ సుమిత్ కుమార్ తెలుసుకుంటున్నారు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇస్తున్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మోహన్, ఆర్డీవో శ్రీనివాసులు, ఇతర జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
News January 5, 2026
ఢిల్లీ అల్లర్లు.. అసలు అప్పుడు ఏం జరిగింది?

2020 ఫిబ్రవరిలో CAA చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఘర్షణలు ఈశాన్య ఢిల్లీలో తీవ్ర హింసకు దారితీశాయి. ఐదు రోజుల పాటు సాగిన ఈ అల్లర్లలో 53 మంది మరణించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన సమయంలో దేశ పరువు తీయడానికి పక్కా ప్లాన్‌తో చేసిన కుట్ర ఇదని పోలీసులు ఛార్జ్‌షీట్ వేశారు. దీని వెనుక ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ ఉన్నారని ఆరోపిస్తూ వారిపై UAPA కింద కేసు పెట్టారు.
News January 5, 2026
ఇప్పుడు మేడారంలో ల్యాండ్‌కు కోకాపేట వ్యాల్యూ..!

మేడారం జన గుడారంగ మారుతోంది. రూ.వేల అద్దెలు రాని ఇళ్లు రూ.లక్షల ధరలు పలుకుతున్నాయి. గజం ధర రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు మేడారంలో ఉంది. కేవలం 10 రోజుల కోసమే ఈ హైటెక్ ధరలు. మేడారంలో 5 రోజులపాటు HYDలోని కోకాపేట ధరలు పలుకుతాయి. షాపులు పెట్టుకునే వారికి యజమానులు చుక్కలు చూపెడుతుంటారు. షాపులకే కాదు, 4 రోజుల పాటు జాతరలో ఉండేందుకు సైతం రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు గదులకు కిరాయి వసూలు చేస్తున్నారు.


