News January 12, 2026

కామారెడ్డి జిల్లాలో స్థిరంగా ఉష్ణోగ్రత

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటలు నమోదు అయిన ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. 5 రోజులుగా 10 డిగ్రీలలోపు నమోదైన ఉష్ణోగ్రతలు నేడు స్థిరంగా ఉన్నాయి. జుక్కల్ 12.4°C, మేనూర్ 13.2, పెద్దకొడప్గల్, డోంగ్లి 13.9, మాక్దూంపూర్ 14, బిచ్కుంద 14.2, సర్వాపూర్ 14.3, పుల్కల్ 14.4, కొల్లూరు 14.9, సోమూరు, దోమకొండ 15°C అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News February 4, 2026

భీమవరం: జగన్ పర్యటన.. హెలిప్యాడ్ పరిశీలించిన నేతలు

image

ఈనెల 5న మాజీ ముఖ్యమంత్రి జగన్ గురువారం భీమవరం పర్యటనలో భాగంగా బుధవారం వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు, భీమవరం ఇన్‌ఛార్జ్ వెంకట్రాయుడు తదితరులు పెద అమిరంలోని హెలిప్యాడ్ ను పరిశీలించారు. శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు కుమారుడు చిట్టిరాజు వివాహ వేడుకకు ఉదయం 11.25 గంటలకు జగన్ రానున్నారు . నూతన వధువు వరులను ఆశీర్వదించి 11.55 తిరిగి హెలిప్యాడ్‌కు చేరుకుంటారని వారు తెలిపారు.

News February 4, 2026

U19 WC: భారత్ రికార్డు

image

అండర్-19 మెన్స్ వరల్డ్ కప్‌లో భారత్ డామినేషన్ కొనసాగుతోంది. టీమ్ ఇండియా ఫైనల్ చేరడం U19 WC చరిత్రలో ఇది పదో సారి. దీంతో మొత్తం 16 ఎడిషన్లలో అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఇవాళ SF-2లో AFGపై 311 పరుగులు ఛేదించగా, U19 WC హిస్టరీలో ఇదే హయ్యెస్ట్ సక్సెస్‌ఫుల్ రన్ ఛేజ్. మరోవైపు వరుసగా 6 ఎడిషన్లలో (2016, 18, 20, 22, 24, 26) భారత్ ఫైనల్ చేరడం విశేషం.

News February 4, 2026

SRPT: మున్సిపల్ ఎన్నికలకు పటిష్ఠ భద్రత: SP

image

నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికలు సవ్యంగా, నిర్వహించేందుకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని ఎస్పీ నరసింహ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం సాయంత్రం నేరేడుచర్ల పోలీస్ స్టేషన్‌ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడారు. పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర పోలీస్ శాఖ నూతనంగా చేపట్టిన ఇంటి వద్ద నుంచే ఎఫ్ఐఆర్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.