News December 14, 2025

కామారెడ్డి జిల్లాలో 20.96% పోలింగ్

image

కామారెడ్డి జిల్లాల్లో రెండవ విడత ఎన్నికల్లో భాగంగా ఉ.9 గంటల వరకు 7 మండలాల్లోని నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది.
గాంధారి మండలంలో 27.74%,
లింగంపేట -9.94%
మహమ్మద్ నగర్- 20.42
నాగిరెడ్డిపేట్-19.51%
నిజాంసాగర్- 24.85%
పిట్లం- 20.19%
ఎల్లారెడ్డి- 28.53%
పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Similar News

News December 16, 2025

సిరీస్ మధ్యలో బుమ్రా ఎందుకు ముంబై వెళ్లారు?

image

IND vs SA T20 సిరీస్ మధ్యలో జస్ప్రీత్ బుమ్రా జట్టు నుంచి తప్పుకోవడం వెనుక వ్యక్తిగత కారణాలున్నట్లు BCCI వెల్లడించింది. అత్యంత సన్నిహిత వ్యక్తి హాస్పిటల్‌లో చేరడంతో వెంటనే ముంబైకి వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది. మూడో T20 టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పరిస్థితి మెరుగుపడితే 4 లేదా 5వ మ్యాచ్‌కు బుమ్రా తిరిగి జట్టులో చేరే అవకాశం ఉందని BCCI అధికారి తెలిపారు.

News December 16, 2025

అనంత: మీ ముగ్గులు మా Way2Newsలో..!

image

ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మా Way2Newsకి పంపండి. మీ పేరుతో మేము పబ్లిష్ చేస్తాం.
ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి.

News December 16, 2025

నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు

image

కృష్ణా జిల్లా పాఠశాలల్లో విద్యార్థుల కోసం ఆధార్ ప్రత్యేక క్యాంపులు మంగళవారం నుంచి నిర్వహించనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. నవంబర్‌లో నిర్వహించిన క్యాంపుల కొనసాగింపుగా ఈ నెల 16 నుంచి 20 వరకు, అలాగే 22 నుంచి 24 వరకు క్యాంపులు జరుగుతాయని పేర్కొంది. బయోమెట్రిక్ అప్‌డేట్ మిగిలి ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.