News August 16, 2025

కామారెడ్డి జిల్లాలో 3,705 ఫోన్‌ల రికవరీ

image

సీఈఐఆర్ పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలో ఇప్పటివరకు 3,705 సెల్‌ఫోన్‌లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఫోన్ పోయినా లేదా దొంగతనానికి గురైనా ఆందోళన చెందకుండా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా తిరిగి పొందవచ్చన్నారు. మొబైల్ పోయిన వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

Similar News

News August 16, 2025

పిల్లల్ని కనే రోబో.. 9 నెలల్లో డెలివరీ!

image

కృత్రిమ గర్భంతో పిల్లల్ని కనే రోబోను చైనా అభివృద్ధి చేస్తోంది. సింగపూర్‌ నాన్యాంగ్ వర్సిటీ సైంటిస్ట్ డా.జాంగ్ కిఫెంగ్ నేతృత్వంలో ‘ప్రెగ్నెన్సీ రోబో’ను పరిశోధకులు డెవలప్ చేస్తున్నారు. ఇందులో ఆర్టిఫీషియల్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్‌ను ప్రవేశపెట్టి, ట్యూబ్ ద్వారా న్యూట్రియెంట్స్ అందిస్తారు. 9 నెలల్లో శిశువు తయారవుతుంది. 2026 నాటికి రోబో నమూనా తయారవుతుందని, ఇందుకోసం ₹12.96L ఖర్చవుతుందని చెబుతున్నారు.

News August 16, 2025

సుంకాలపై మారిన ట్రంప్ వైఖరి!

image

పుతిన్‌తో భేటీ ముగిశాక ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలపై ప్రస్తుతం సెకండరీ టారిఫ్స్ విధించే అవసరం లేదు. 2-3 వారాల్లో దీనిపై మరోసారి ఆలోచిస్తా’ అని చెప్పారు. కాగా ప్రస్తుతం ఇండియా దిగుమతులపై 25% టారిఫ్ అమలవుతోంది. అదనంగా మరో 25% సుంకాలు ఆగస్టు 27 నుంచి అమలు కానున్నాయి. ట్రంప్ ప్రకటనతో ఈ టారిఫ్స్ నిలిచిపోయే అవకాశం ఉంది.

News August 16, 2025

గర్భిణి ఆత్మహత్య.. భర్త, అత్తమామల అరెస్ట్

image

కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన శ్రావణి అనే గర్భిణి ఆత్మహత్యకు కారణమైన భర్త, అత్తమామలను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. అత్తారింటి వేధింపులు భరించలేక ఈ నెల 14న పుట్టింటికి వెళ్లిన శ్రావణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు కారణమైన భర్త శ్రీనివాసులు, మామ శివప్ప, భర్త కరియమ్మలను ఇన్‌ఛార్జి డీఎస్పీ శ్రీనివాసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. జడ్జి రిమాండ్ విధించారు.