News March 4, 2025
కామారెడ్డి జిల్లాలో 38 ఇంటర్ పరీక్ష కేంద్రాలు

కామారెడ్డి జిల్లాలో 38 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం తెలిపారు. ఈ నెల 5 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పరీక్షలు కొనసాగుతాయని చెప్పారు.
Similar News
News November 9, 2025
19 నుంచి 23 వరకు పల్నాటి వీరుల ఉత్సవాలు

పల్నాటి వీరుల ఉత్సవాలు కారంపూడిలో ఈ నెల 19 నుంచి 23 వరకు జరుగుతాయని పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ తెలిపారు. 5 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల వివరాలను ఆయన ప్రకటించారు. నవంబర్ 19న రాచగావు, 20 రాయబారం, 21 మందపోరు, 22 కోడిపోరు, 23 కల్లిపాడు జరుగుతాయని తెలిపారు. 22న కోడిపోరు సందర్భంగా పెద్ద ఎత్తున తిరునాళ్ల జరుగుతుందన్నారు. పల్నాడు బ్రహ్మనాయుడు వీరాచారవంతులు కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు.
News November 9, 2025
ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులు.. రంగంలో దిగిన పోలీసులు

బల్లికురవ మండలానికి చెందిన రాజేష్‌ను క్వారీ పని నుంచి తొలగించారంటూ శనివారం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని రాద్ధాంతం చేశాడు. విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే బల్లికురవ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అల్లిపురం ఎస్ఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతనికి నచ్చజెప్పి విజయవంతంగా అతన్ని కిందకు దించారు.
News November 9, 2025
‘మీ కోసం’ రద్దు: కలెక్టర్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11న జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 10న సోమవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ‘మీ కోసం’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు శనివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. దూర ప్రాంతాల నుంచి ఎవరూ అర్జీలు అందించేందుకు జిల్లా కేంద్రానికి రావద్దని సూచించారు.


